Submit your work, meet writers and drop the ads. Become a member
ఈ జగన్నాధ నాటకంలో నేనొక పాత్రనైతే
నా పాత్రకు ప్రణం పోసి
నా చుట్టూ అనేక పాత్రలు పోషించి
నన్నే తన ప్రపంచం చేసుకుని
ఈ ప్రపంచాన్ని నాకు పరిచయం చేసి
నా నవ్వే నీ ఆనందమని
నా బాధే నీ కన్నీరని
నా స్నేహితులే నీ స్నేహితులని
నా విజయం నీదని
నా కొసం నీవెన్ని వదులుకున్నావో..
అమ్మా నీకు వందనం !!

నేనెంత దూరాన్ని ఉన్నా
నీ ప్రేమే నాకు శ్రీరామరక్ష
కావాలోయ్ కావాలోయ్ జీవితానికో నేస్తం

కదలక అలసిన మనసులో కలతను తీర్చె
పచ్చని పైరుగాలిల కావాలోయ్ ఒక నేస్తం

విడివిడిగా హడావిడిగా అతి వేగంగా సాగే
ఈ జీవన సాగరంలో నలుగురితో నడక నేర్పే
గులాబి కిరణం లా కావాలోయ్ ఒక నేస్తం

గమ్యం చేరే వేగంలో ఆదమరచిన నిన్ను నిద్రలేపే
పసుపైన సూర్యకిరణంలా కావాలోయ్ ఒక నేస్తం
ఏదో తెలియని కొత్తదనం
ఎందుకో తెలియని ఈ భిరుకుదనం
ఎటుచూసినా గెలవాలనే వేగం
భావాలను మ్రింగేసె మౌనం
ఆనందపు వేటలో సాగే పయనం
మదిని తన చల్లని స్పర్శతో తాకే ఈ పవనం
నీడవెలుగులో తగిలే వెచ్చటి కిరణం
భంధాలను వెతికే ఈ తరుణం
కిచకిచలతో పలకరించే పక్షిరాజు గానం
మొదలైంది  ఈ దేశంతో నా ప్రణయం
ఒక్కసారిగా ఒంటరితనం నన్ను హత్తుకుంది
కొంతసేపు ఆదరించ, మరికొంతసేపు సహించ,
ఇంకొతసేపటికి దానితో పోరాటం మొదలుపెట్టా..
ఏం లాభం ?? ఒంటరిపోరాటం ఒంటరితనంతొ!!

అమాంతం ఒంటరితనం ఓడిపోయింది
ఈక్షనం ప్రపంచం నాకు బానిస అయింది
కనులముందు ఎవరులేరు ఏవినికిడి లేదు
కాని కళ్ళల్లో ఓ ఆనందం పెదవులపై ముసి నవ్వు
ఇదంతటికీ కారణం నీ జ్ఞాపకం

.... నీ జ్ఞాపకాలతోనే నా పయణం
ఆలోచన.. ఆలోచనా
ఎంధుకు నీకు తనంటే అంత ఇస్టం?

తన అందం నీ కలలకు రూపమనా?!
తన వైయ్యారం నిను గిలిగింతలు పెట్టిందనా?!
బాధలో నిను ఓదార్చిందనా లేక నీకు బాధను మిగిలించిందనా??!!

ఆలోచన.. ఆలోచనా
ఎంధుకు నీకు తనంటే అంత ఇస్టం?

స్నేహంగా పలకరిస్తే ప్రేమనుకున్నావు  
కాదు అని మందలిస్తే తను నీదనుకున్నావు
వద్దని వెల్లిపోతే వెక్కి వెక్కి ఏడ్చవు.

ఏడుస్తున్న నిన్ను ఓదార్చే శక్తి నాకు లేదు
ఏడవకు అని చెప్పే దైర్యం నాకు లేదు
తను రాదు అనేది నిజమైతే నా జ్ఞాపకానికి అర్థం లెదు
తనకొసమే ఎదురుచూస్తూ నేతోనే గడిపేస్తా!!

— The End —