Submit your work, meet writers and drop the ads. Become a member
 
Babu kandula Sep 2012
తెల్లంగా ఉండే అమ్మాయే మదిని గిచ్చి పోయిందే
మెల్లంగా ఉండే అబ్బాయే మదిని పట్టుకుని వెనకే పడ్డాడే
పాల సముద్రంలో లచ్చమ్మ లా ప్రేమ తీరంలో దేవతలా
కంటికి కనపడుతోందే అలా ఇలా...
ముట్టుకుంటే కరిగిపోయేలా పట్టుకుంటే కందిపోయేలా
ఇంత అందాన్ని ముందే పెట్టావే భగవానుడా...
కోరికలున్న జీవాత్మని కోరుకుంటున్నా తన ప్రేమని
దక్కేలా చేసేయవా భగవంతుడా...
dim light లో ఉన్నానే moon lightలా ముందుకోచ్చేయవే  
amnesia patientలా ఉన్నానే నీ చేతి స్పర్శతో నయం చేసేయవే
పంచముఖ రుద్రాక్షలా నా మదిని సుద్ది జరిపించవే
నీపై ఉన్న fever ని తగ్గించేలా krocin , saradon లా కదిలివచ్చేయవా
fans  association అంటూ ఉంటె ఆ club మొత్తంలో నేనే ఉంటానే
నువ్వు ఉన్న చోటనే భూమికి boom rise అవుతుందే
కోట్లతో నిన్ను పెట్టుకుని శ్రీరామ రక్షలా కాపాడుకుంటానే
నన్ను తిట్టడం నీకేను నన్ను కొట్టినా నువ్వేను
కానీ వదిలిపెట్టి వెల్లిపోయేలా sketch లే వేయోద్దె...
మన జంటే కుదిరేలా మొక్కులు కోరికలు ఉన్నాయే
నా చేతి కవితలా నాతో ఉండిపోవాలే
Babu kandula Sep 2012
వినాయకా విజ్ఞేశ వినమృడనై నీకై అడుగేసా
ఆదిదేవుదవని అభయమిస్తావని అర్దిస్తున్నానే
మూషికవాహనుడా ముందుండి ప్రగతికి దిక్సూచిస్తావని
ఆపదల భారిననుండి రక్షణ కలిగిస్తావని
అజ్ఞానం నుండి విజ్ఞానికి దారిని మలచి
చీకటిలోన వెలుగులు చిమ్మే జ్ఞానదీపం వెలిగిస్తావని
నమ్మకంగా నికే నన్ను అర్పిస్తున్నానే
అజ్ఞాతంలో దాగున్నా వికాసానికి స్పందన కలిగించేయి
ఏదో చేయాలనే ఆరాటంతో సాగేలా దీవించేయి
నా ఉనికే తెలిసేట్టు జయములతో నన్ను స్వాగతించూ
ఏకదంతుడవని మహాభారతం రాసిన మహోన్నతుడవని
నా జీవిత రచనలకు అర్ధం చూపించేయి
బుద్దిని పెంచుతూ బుద్దుడ్ని చేసేయి
మంగళం పలికి కళ్యాణం చేసేయి
సుభాప్రధమే జీవితం అయ్యేలా దీవించేయి
ప్రతిదినం ని నామస్మరనే నాకు దిక్కు మొక్కులే
Babu kandula Sep 2012
కరడుగట్టిన తీవ్రవాదమే నాలో కంటికునుకులు లేకుండే ఉందే
దయా దాక్షిన్యాలకే తావే ఇవ్వకుండా ప్రతిరోజూ పతనాలకే పరుగెడుతున్నానే
మతాలా పేరిట ముసుగులతో మారణహోమం జరిపిస్తున్నానే
మనిషుల రక్తపు ముద్దలనే నైవేద్యాలుగా పెడుతుంటానే
అంతు చిక్కని రీతిలో నా స్ధావరాలనే పెట్టుకుంటానే
త్సునామినో యుగాంతమో అయ్యి లోకవినాశకం చేస్తానే
క్రూరత్వానికి symbol నే చీకటికి address అయ్యిపోయానే
చిర్రెతించేల చట్టానికి చిక్కని మాయలోడినిలే
నన్ను తాకే నన్ను చేరే మొనగాడేలేదే
నా పంధా చూపేందుకే నా ఈ చేష్టలు నే చేసే పనులు ...
Babu kandula Sep 2012
తాటకిలా ప్రియ భాదలకే వేదికవా
చాముండి లా చెలియా మొండిగా నిలబడతావా
నీ వెనకే పడుతోంటే అలుసే అవుతున్నానా
నీ ప్రేమే కావాలంటే అత్యాశే  పడుతున్నానా
రాక్షసుడినే చేయకే రక్తమే చిందించేలా మార్చకే
రక్షణగా నీ ప్రేమతో నన్ను ఒప్పుకోవే సఖి
ఇద్దరి మద్య దూరం ఇరకాటంలో పెడుతోందే
ఇష్టం నువ్వయ్యావే యంత్రంలాగా చేసావే
మనసు మెదడు నీ పేరే పలికిస్తోందే
నా మీదే పట్టే నే పూర్తిగా విడిచానే
నీ ప్రేమతో మళ్లీ స్తిమితంలో కొస్తానే
తడబాటుంటే అది నీ పేరే తికమక పెడుతున్నావే
తప్పేమున్నా నన్ను మన్నించి తారస పడిపోవే నాలో కలిసిపోవే
Babu kandula Sep 2012
అలగా ఓ కలగా అనుకోకుండా ఎదురయ్యావే
సిరిమల్లె పువ్వల్లే పరిమళం వెదచల్లావే
నేనే నువ్వంటూ నా ప్రాణం నీదంటూ మంత్రం వేసావే
నిన్నే చుసేస్తూ నా లోకం నువ్వంటూ ఏదేదో చేసావే
రాధా గోపాలం మనమంటూ ఎన్నెన్నో కలలే
సంక్రాంతి ముగ్గల్లే సరదాల పాటల్లె ఆనందం కలిగిస్తున్నావే
అదిగదిగో ప్రేమరుపం అనిపించేలా కనిపిస్తున్నావే
క్షణకాలం నువ్వుంటే జీవితకాలం సంతోషాలే
సరాగంలా స్పందిస్తుంటే సంగీతమే జనమంతా
పలికే ప్రతిపలుకు నీ పేరుతొ ముడిపడిపోతాదే  
నువ్వే నా ప్రాణం అంటూ ప్రతిధ్వనిస్తోందే
Babu kandula Sep 2012
తప్పులో తుప్పులో మనిషిని పడగోట్టేది
ఒప్పులో గోప్పలో మనిషిగా నిలబెట్టేది
ఏదారిన నువ్వున్నా నీ ఆశయం ఉన్నది నీలోనా
ఏఖాకివైన నలుగురిలో ఉన్న నీ గమ్యం నీదన్నా
ముల్లులో ఉన్నా పువ్వుల మద్య ఉన్నా ఆ స్థితులు  గతులు నీవల్లనా
నీ కర్మలకు ద్రుష్యరుపమే ఈ జీవితం
వాహనమే నువ్వైతే ఆ ఇంధనమే నీలో మంచి చెడులే
కలకాలం నిలిచే వాయువులా నీలో మంచే నీతోడే
Babu kandula Sep 2012
మనిషికి మనిషే తోడూ నీడై ఉండాలే
మన్నించే గుణముంటే మనోవేధనలే కరువాయే
మమతలు పంచె వీలుంటే ప్రపంచం నీదాయే
జాతి మతాలకు అతీతంగా మనుగడ సాగాలే
అందరు ఒకటని గ్రహిస్తూ అజ్ఞానం వీడాలే
ఆద్యాత్మిక సాయంతో నీలో దైవత్వం మేల్కొలపాలే
పూర్వపు జన్మల ఆధారంతో నీ లక్ష్యం కనిపెట్టాలే
ఆశయ సాధనలో అడుగడుగు జతకట్టి సాగిపోవాలే
విజ్ఞానం అందిస్తూ జనుల వికాసానికే పాటుపడాలే
సుఖ సంతోషాలతో లోకం మొత్తం నిండి పొవాలే
Sep 2012 · 715
179.sai ram ki jai
Babu kandula Sep 2012
షిరిడి సాయి నాధా
శివునికి రూపమని
రాముని అంసవని
యేసులో కరుణవని
అల్లాకే ప్రతిరూపమని
నిన్నే కొల్చుతున్నానే......
శరణు కోరే శత్రువుకైన ప్రేమని పంచె మహాత్ముడవని
జాలిని  కురిపించే  నిత్య  సంతోషరూపమని  
జనుల  కోరికలు  తీర్చే  కల్పవృక్షమని
మనసారా నిన్నే స్తుతిస్తున్నానే.....
భిక్షాటన చేస్తూ వారి వారి పాపములు మోసే దీనబంధువని  
రుగ్మతులు తొలగించే వైద్యరూపదారుడవని  
కటిక చీకటిని కడతేర్చే కరణజన్ముడవని
సద నీ నామ స్మరణలో మునిగిపోయెనే....
అనంత  జ్ఞాన సాధనకు నువ్వే శరణం
ఇహలోక గమ్యాలకు నువ్వే ఆధారం
ముక్తిని పొందే మార్గానికి ప్రధమం
ఆత్మ జ్ఞాన సొంతానికి నువ్వే మూలం
సృష్టిలోని జీవులకి నువ్వే సర్వం .....
కాలమే నువ్వేనోయి మా కర్మలే నీవేనోయి
వేద పాఠాలన్ని  నీ  మాటలలోయి
నీ పాదాల  చెంతే  గొప్ప  క్షేత్రమోయి  
గంగా యమునలు  నీ మాటకు  లోబడి  ప్రవహిస్తాయి
శ్రేష్టమైన  వాక్కులుంటే అది  నీ పేరే  సాయి
రాతిలాంటి  మమ్మల్నే  మనిషిగా   మార్చేయి  
జన్మలు  అన్ని  సార్ధకం  చేసేయి
మనిషుల  మనసులే  సుద్దె ­ చేసి
జీవితాలనే  చరితార్ధం  చేసేయి .....
ఓం  సాయి శ్రీ సాయి జయ జయ సాయి
శ్రీ సచ్చిదానంద సదుగురు సమర్ధ సాయి నాధ్ మహారాజ్ కి జై
Babu kandula Sep 2012
ఇదేమ్ లోకమో సెల్లులతో సావాసం
వినికిడికే లోపమా ఈ ప్రభావం
నిదురకే భంగమా ఈ యుగం
మనసులో ముళ్ళులే ఈ భారం
కళ్ళకే కష్టమా ఈ ఉపకరణం
ధ్వని తరంగాలే ముఖ్యమా ఈ పయనం
దూరాలే తరుగునా ఈ సౌకర్యం
అత్యవసర పరిస్తితులకే ఆవశ్యకం
నిన్ను వీడని తోడులా నీవెంటే అందరం
జాడను తెలుసుకునే అవకాసం నిరంతరం
నిత్యావసర వస్తువుగా మలిచిపెట్టేసారే
మొబైల్ ఫోన్ లే జీవితంగా మార్చేసారే
ప్రాధాన్యతలే పెంచుతూ కృత్రిమ యమపాశాన్నే మోస్తున్నారే
దిన దిన గండంగా బ్రతుకులే అయ్యిపోయాయే
Babu kandula Aug 2012
మధురాతి మధురంగా మనసులో మెదిలావే
మాటలకూ అందనంత మహిమలు చూపావే
నా  లోకం నువ్వంటూ నా లోనే నిలిచావే
వెన్నెలవై  ఆకాశం నుండి దిగిపడ్డావే
వర్షంలో తొలకరి జల్లై నన్నే తడిపేసావే
వరముకు రూపం నువ్వే వర్ణించే బొమ్మవే
నవతేజం నాలో నింపే నవరాగం నువ్వే
నా పెదవులు పలికే నవ్వే అది నీవల్లే
నాలో సగముగా నాలో ప్రేమగా మారిపోయావే  
నీ దిక్కులే తెలిసేలా చుక్కలతో వెతికిస్తున్నానే
తారాలోకంలో నువ్వు ఉన్నావని తారాసాపడతావని తెగ తప్పిస్తున్నానే
Babu kandula Aug 2012
లోకం యెదలో నిద్రించిన ఆశయం
మనిషిని మనిషిగా చేసే సంకల్పం
మనుగడనే క్లిష్టం చేసిన మానవికానికి
కలం గర్భాన కలసిన మానవతా విలువలకి
మనుషులనే ప్రశ్నించాలి
మరుజన్మే రావాలి
మారపులే మరపులై మళ్లీ జీవించాలి
కోపం శాపం రెండు భారం
జాలి ప్రేమ జీవులకు అర్ధం
జన్మకు అర్ధం తెలియాలంటే జీవన చిత్తం పాటించాలి
చైతన్య రూపం దర్శన భాగ్యం పోందేయాలి
మునపటి జన్మలే విశ్లేషించి జీవన కర్మలే సాగించాలి
ముక్తిని పొందే రీతిగా నీ పాయం ఉండాలి
Babu kandula Aug 2012
ఏమైందో ఏమో చల్లగాలి మంచల్లే నన్ను తాకేసింది
పన్నీటి వాని కురిసేసింది ఆహ్లాదంలోనే ముంచేసింది
రాగంలా నన్నే పలికించిందే తనువంతా హాయే కలిపించిందే
గుండెల్లో గూడును కట్టించిందే గూడంతా గోలే పెట్టించిందే
ప్రేమంతా నాలో పొంగించింది పసిపాపలాగా చేసేసింది
మనస్సంటులేని మాసు గాడ్ని ముద్దైన మాటకు పడిపోయానే
మాటలకూ ఏమో అంతం లేదు నిన్ను చూసినాకే ముగాబోయానే
కన్నీళ్ళకే  నేను కరిగిపోతూ కోపాలకే కరువైపోయానే
కాసేపైన నీ ప్రేమలోనే పడితేలిపోయేలా  కన్నీటి ధారలతో వేచి ఉంటానే
Babu kandula Aug 2012
పాపంరో పాపా బంగారు చేప నా దారికే అడ్డురాకా
సయ్యి అంటూ సిలక సరదాల సాకా నా వెనకే పడకా
పోపోవే బాలా పొయ్యి మీద కాకా రారాకా నాపైకే నువ్వలా
గుమ్మంది పుష్పంలా గుబాళించే వాసనలా నా వరకు రాకా
చంద్రుడ్ని చుట్టే రేతిరిలా సూర్యుడ్ని కమ్మే మబ్బులా కబళించకలా  
వసంతంలో కాచే ఎండలా హేమంతంలో ఉండే రోజులా నన్ను చేసేయకలా
పాటలు పాడే కోయిలై  ప్రేమను పంచే దేవతై నా ముందే ఉండకలా
కొమ్మల్లో దాగిన కాయలా మేఘంలో ఉన్న చినుకులా దాగుంది నాతో ఆడకలా
ఏం పాపం  ఎరగని వాడినే కల్లాకపటం తెలియని బాలుడినే కష్టాలభారిన పెట్టకే
కరిగిపోయే మంచునై కాళ్ళకింద నీరులా నన్ను మాత్రం చేయకే అలా ఎలా
Babu kandula Aug 2012
ఊహా చిత్రంలా ఊహల్లో  మెదిలావే
స్వప్నాసుందరిలా కలలో కదిలావే
కంటి దీపంలా కన్నుల్లో మెరిసావే
కస్తూరి తిలకంలా నీ నుదుటున చేరాలే
నీ కాటుక కళ్ళల్లో నే ఒదిగిపోవాలే
కురులా అందంతో నన్ను బంధీ చేసావే
గమ్యంలాగా  కనిపిస్తున్నావే
అధిరోహించే శికరంలా ఎదురోస్తున్నావే
సైకత శిల్పంలా పట్టే దొరకవులే
మంచు బింబంలా చేజరుతూంటావే
నిన్ను పొందే తేది కొసమై తప్పక చూస్తానే
Babu kandula Aug 2012
జో జో జోడి జతకట్టే తోడై ఉండాలి
జీవిత భాగాన్ని పంచుకోవాలి
నమ్మకప్రాయంగా నలు దిక్కులా ఒదగాలి
పాలు నీల్లై సాంఘత్యం సాగిపోవాలి
సహన పూర్వంగా సహగమనం సద్దుమనగాలి
సంతోషాలా సాగరంలో పరుగులు తియ్యాలి
నవీన యుగానికి ఆధ్యం పోయాలి
చివరాకరివరకు జంటగా జీవించాలి
Babu kandula Aug 2012
ఏదేదో అయ్యిపోతున్న నేను ఏమైనా కాదనలేకున్నాను
కన్నీటి బుడగల్లె కళ్ళల్లో మెదిలావే
మండించే మంటల్లె తనువంతా మిగిలావే
భాధించే పిడుగల్లె గుండెల్లో పేలావే
అణువణువు నువ్వుంటూ ఆరాటం పెంచావే
ఆలోచనలకు రూపం నువ్వు అయ్యిపోయావే
నన్నే సాధించేలా నువ్వు గెలిచావే
మనసుకు ముసుగులు తోడిగేలా మార్చేసావే
నా ఉణికే ప్రశ్నార్ధకంగా మారిపోయిందే
నన్ను నేనుగా అన్వేషించేలా చేసేసిందే
Babu kandula Jul 2012
గాలై వీచి శ్వాసై చేరే వరమే ప్రేమ
పాదం కలిపి ఏడు అడుగులు వేసే మంత్రం ఈ ప్రేమ
శతకోటి విద్యలు ఔపాషణ పడతా ప్రేమ గెలుపులకే
ప్రాణంగా ప్రేమించానే ఎడబాటులా నువ్వే ఉన్న సరే
జాలిపడవే జానకిలా శ్రీ రాముడిలా నిన్ను ఏలుకుంటానే
నీ పేరే నాకు కొలమానం ఎవ్వరికైనా అందించే సాయంగా
నీ రూపే నాకు చిహ్నం ఎందరికైనా అది ఉపకారం
నీ మాటే నాకు వేద మంత్రం ఎన్నాలైన నీదే చిత్తం
నీ చూపే నాకు మంచిని పెంచే బ్రహ్మాండం
Babu kandula Jul 2012
కాలిభాటన నడిచే కష్ట జీవులం
కంటి కునుకులు మరచిన జీవ రాశులం
అర్ధం పర్ధంలేని ఆలోచనలకే తావేలేని
ఆరాటంతో ముందుకు సాగే గుండే ఉంది
ధీటైన సవాల్లకే ఘాటైన జవాబులు అందిస్తాం
గద్దించే సింహంలా సంచారం చేసేలా ఉంటాం
గండాలే గమ్యాలుగా మలచేలా ప్రతిఘటిస్తాం
మావంతు సాయంగా జగతిని కాపాడే పనులే చేస్తాము
Babu kandula Jul 2012
నిన్నే ఇలా నీలాకాసంలా అనుకుముంటానుగా
నిరీక్షనే నాకు నీకోసం ఉన్నా అన్వేషణ
నీడలా కలవలేకున్నా చిత్రహింసలు పడిపోతున్నా
కళ్ళకు కనువిందే చేసావే కౌగిలికే కరువయ్యావే
కాసేపే కనిపిస్తావు మెరుపల్లే కనుమరుగైపోతావు
కలలాగే మిగిలావు కన్నిల్లే కానుకగా పంపావు
చినుకల్లే తడిపావే అంతలోనే మంటేపెట్టావే
చావుకి బదులు తెలిసేలా చిమ్మ చీకటి చూపించావే
పేగుబంధమే పుట్టించిందే ప్రేమబంధమే పాటం నేర్పిందే
పాతాళం చేరినట్టుందే ప్రియతమా నువ్వు నన్ను విడిచి వెల్లినాకే
Babu kandula Jul 2012
నేను నేను ఉన్నది నీకోసం
నీకు నేను అన్నది ప్రతినిమిషం
గాలిలాగా వీస్తున్నా ఘాడంగా నిన్ను ప్రేమిస్తున్నా
గంగలాగా పొర్లుతున్నా గుండెల్లో గూడే కడుతున్నా
గగనంలా నిర్మలంగా కనపడుతున్నా నీ కదలికలే కనిపెడుతున్నా
మంటలు ఎగసే కాలాగ్నినైనా నిన్ను చూసాకా కవ్వించిపోనా
పృథ్వికే  తోడుగా నిలిచే ప్రకృతిలా నా చెంత నువ్వు ఉండిపోవా  
నిన్ను మరువలేకున్నా నీ ధ్యానంలో ములిగే ఉన్నానే
నా ప్రాణం నువ్వే నా సర్వం నువ్వే నువ్వే
Babu kandula Jul 2012
అన్యాయం కట్టలు  తెంచుకుంటే  కుట్రలు  కుదిపేస్తుంటే  కుతంత్రాలతో  కసాయిమూక­లు   కమేస్తుంటే.
కరుణించే  నాధుడే  కాళభైరవుడై   కత్తులు  పట్టి  కంచెలు  కట్టి  కాపాడే  దేవుడే .
యుద్ధం  చేసే  యోధుడై  దుష్టసంహారం  చేసే  యుగ పురుషుడులా    వస్తాడులే .
తారాలోకం  నుండే  తరలి  రావాలని  దుర్మాగాన్ని  తూట్లు  పొడిచి  రక­్షిస్తాడని .
దుష్టశక్తులు  ఎన్నెన్ని  ఎదురైనా  రుధ్రుడిలా   భద్రుడిలా   భీభస్తమే    సృష్టించేయవా  .
బలిపశువులుగా  అశువులను  తీస్తున్న  అరాచకాలనే  ఆపే  సైనికుడిలా  క­దిలివస్తావా .
యముడిని  ఉపాశన  చేసి  యమకింకరుడిలా  కాలే  కష్టజీవుల  కడుపులను  క­ాపాడవా  .
కాలయాతనే  కరిగిపోయేలా  కలతలు  అన్ని  చెరిగిపోయేలా  చేసేవా .
Babu kandula Jul 2012
ఓ  మాట  చెప్పన  మల్లె  తీగలాగా  నువ్వ్  మనసే  లాగుతుంటే  మరు   మాటే  నాకు  రాదుగా .
మహిమాన్మితంగా  మనసే  విచ్చుకున్నదే  మోహరించే  నీ  కంటిచూపుకే .
మూసి  ఉంచిన  హృదయ  వేదనలే  తలుపు  తెరచి  వెల్లిపోయేనే .
ముసుగులాటగా  నీ వెనకే   అనుసరించుతూ  నీ  అడుగుజాడలో  ఉండిపోనా.
దేవేరిలా  నా  చెంతకే  వస్తే  పూజారిలా  పూజించనా అర్చలనే  చేసేయనా .
లాలించే  పాటలతో  శ్రావ్యంగా  నిన్నే  కంటిపాపలా  చూసేసుకోన .
మెల్లగా  మత్తే  జల్లుతూ  నిదురలో  నన్ను  పూర్తిగా  ముంచేయవే  
అద­ి  నీ  ప్రేమకే  బదులుగా  నే  భావిస్తానే  నిన్నే  ప్రేమిస్తానే.
Babu kandula Jul 2012
రగులుతున్న రేపటికి   ఆధ్యం   పోసేలా   నువ్వుండాలని .
ఆస్తిపాస్తులు  అన్ని  నీ  ముందున్న  ఆశయ  సాధనలని .
ఆవేశం  కోపం  వ్యర్ధాలని  ఆలోచనలతో  సాగాలని .
అందివచ్చిన  అవకాశాలనే  సాయశక్తులా  ఉపయోగించుకోవాలని .
అలుపులని  మలుపులని  చూసి  బెంగపడకుండా  అడుగేయాలని .
సహనంతో  శత  విధాలా  ప్రయత్నించాలని .
సాహసమే  సకల  జనులకి  అవసరమని .
కష్టానికి  ప్రతిఫలం  దొరికే  తీరుతుందని .
విజయాలకే  మల్లె  భాటకి  ఇవ్వన్ని  సంకేతాలని  
తెలుసుకోర  నువ్వు ­ తెలియజేయర  నీ  మాటలతో  మన్మోహనంగా  అనురాగప్రాయంగా .
Babu kandula Jul 2012
గోకులంలో గోపెమ్మలా గౌరీ  పూజలో సుమధుర మంధారమా
రేపల్లేలో రాధమ్మలా రత్నాల మాలికలా ఉన్నావమ్మా
నింగి నేల నీలాగా నవయవ్వనం గా కనిపిస్తుందే
నీ మనసు మమతలు కోసం నేనే వేచి ఉన్నానే
వయారంగా ఉన్నా నిన్నే వదువుగా మార్చి జత కట్టాలే
రోజా పువ్వులా రోజు వీస్తున్న నిన్నే రోజు చూడాలి
రామాయణ కావ్యంలా మధురంగా నువ్వు ఉన్నావే
గాలి వానలు ఎదురైనా నా గమ్యం అయిన నిన్నే చేరుతానే
గుబాళించే వాసనకు చిరునామాగా నిలిచింది నువ్వేలే
గంధం పసుపు పూసిన కుంధానపు  బొమ్మ నువ్వేలే
కంటికి ఇంపుగా కనపడే అందామా నువ్వేనా సర్వములే
సాయంత్రాన వెలిగే వెలుగులు అవి నీ నవ్వులులే
నాకు వికాసం పెంచే అభివృద్ధి పధకంలా తగిలావే
నిప్పులా రాజుకున్న ప్రేమకే నిలువెత్తు సాక్ష్యం నువ్వే ప్రేమ
అర్ధం చేసుకుని నా ఆరాధననే స్వీకరించేయవే ప్రియ.
Babu kandula Jul 2012
ఎందుకమ్మా  ఈ  ఎడబాటు  గుండెపోటు  తెప్పించి  వెళ్ళిపోకు .
గండు  చీమలా  కుట్టి  వెళ్ళవు  గందరగోళంలో  నన్ను  పెట్టావు .
Black hole లాంటి  మనసు  నీదే  బయటపడటం  అంటే  కష్టమేలే .
Bumgy jump చేస్తానే  sky  diving కూడా  చేస్తానే .
మేరి  దిల్ కి   దడకన్  నువ్వే  ఉంటానంటే  .
Big bang theory లా  mystery గా  మిగిలావే .
History నే  తలపించే  lovestory నాదేలే .
ఘారాలే  పెట్టిన  గండాలే  కలిగిన  నిన్ను  వీడలేనే .
Milkyway నే  మించే  అందంతో milk shake చేసావే .
పదే  పదే  గుర్తొస్తూ  నా  memory మొత్తం  నువ్వయ్యావే .
నల్లమల్ల  అడవికైనా  సై  అంటూ  నీవెనకనే  వస్తానే .
ఎంతగా  తపించిన  ప్రయత్నించినా  అది  నీవరకే   నీ  కొరకే  ప్రేమ .
Babu kandula Jul 2012
భాగ్యనగరమా  బంగారు  భవితకే  మంచి  సోపానమా .
విద్యకు  మూలంగా  విలయతాండవమే  చేస్తున్న  మహా నగరమా .
వివిధ  రంగాలకు  స్థానం  కలిపించిన  metro  నగరమా .
కళలకే  గీతాసారంలా  నిలిచేలా  వేదికా నగరమా  .
అంతులేని  గమ్యాలనే  అలవోక  సాగించేలా చేసే  విజయ నగరమా .
రాజకీయ  రౌరవానికి  ఊతమిచ్చే    political నగరమా .
Real estate కి  రూపురేఖలు  ఇచ్చిన  రాజధానినగరమా .
Software field కి  ఆయువుపోసిన  hitech నగరమా .
నైజం  పాలనలో  పరవళ్ళు  తొక్కిన  hyderabad నగరమా .
మేధా  సంపదకి  మాయ  తివాచీల  నిలిచినా  మనసైన నగరమా .
ఈ  వర్ణములతో   నా  భాగ్యం  తీరిందే  నా  భాగ్య నగరమా .
Babu kandula Jul 2012
అలజడులే   సృస్టించిన    అందాల   ఆనందమా.
ఆహ్లాదమే   కలిగించిన   సంతోషాల  సౌందర్యమా .
కవ్వించే  కాలంలా  నా  కలలో  మెదిలే  కావ్యమా .
ఆశకే  బదులుగా   మారిన  అంతుచిక్కిన  రూపమా .
అరద్యమే   అయ్యిపోయిన  దివినుండి  దిగివచ్చిన  దీపమా.
నా  భాదకి  నీనుండి  ఎడబాటులే   ఓ  అర్ధమా .
నా  జన్మకే  నీతో  బంధమే  ఓ  కారణమా .
నీ  తోడుగా  నెమలి  పించలా   నేనుండిపోతానని  .
నీ  నీడగా  నీ  జడ   కొప్పులా  నేనుంటానని .
ప్రేమగా  ప్రీతిగా  నీ  వెనకే  ఉంటానని .
పసిడి  బొమ్మ   పసి  పాపలా  నేను  చూసుకుంటానే  .
ప్రేమ  పంతులమ్మలా   ప్రేమ  పాఠాలనే నేర్పిస్తావని  జరబద్రంగా  చూసుకుంటనే  .
నాలో  నిండినా  నీకే  ఈ  భావనలే  మధురంగా  అందిస్తూన్నానే  .
అర్ధం  చేసుకుంటావని  అంధలం  ఎక్కించాలని  అకాంక్షిస్తున్నానే .
Babu kandula Jul 2012
కలలా    మెదిలే   కస్తూరి    బొమ్మలా    కమ్మని    తరువే   ఉందంటా   .
కల్పవృక్షంలా  కాసుల  వర్షం  కురిపించే  కన్నుల  పండగా .
నేరేడు  చెట్టులా  నాలుగైన  కొమ్మలతో  నిండి  ఉన్నదే .
రెమ్మలతో   కూడిన  కొమ్మలే    పువ్వులు   కాయలు  కాచేలే .
నీటిని  అందించే   వర్షంలా    తల్లి    మారేలే .
వాయువే  అందించే   గాలిలా  తండ్రి  మారిపోయేనే .
వేదంలా  నిలిచింది  మొత్తం  సాంఘత్యమే.
వరమల్లె    సాగింది  ఈ  బంధ­మే .
అది వారధిలా  చేసింది  ఈ  సంబంధమే .
Babu kandula Jul 2012
నా మీద  కురిసిన  సంపంగి  వానవా .
మత్తెకించిన   మరు  మల్లె  జల్లువా .
చినుకులా  రాలిన  గులాబీల  వర్షమా .
గుండె  కోరిన  చామంతి  వర్షమా .
ఆహ్వానమే  మన్నించి  కురిసిన   ఆహ్లాదమా .
ఆయువంతా  నీకు  అందించే  వెల్లువే  పోషిస్తున్నానే.
నా  పరువపు  వయసే  నీకు  అందిస్తున్నానే  .
కాదనకుండా  నా  కానుక  స్వీకరించవే  చెలి .
నా  మదిలోని  భాషలు  అర్ధం  చేసుకోవే  మరి .
దాని  మాటలే  నీకోసం  ప్రాణాలై  నీ  వెనకే  అనుసరిస్తున్నదిలే.
నీ  మనసులో  ఒక్క  చోటుకై  పరితపిస్తోందిలే .
ఘారంగా  ఘాడంగా   గల  గల  సాగిపోవాలే  నీతోనే   ప్రియతమా.
Babu kandula Jul 2012
పో  పో  అంటున్నది  మనసే  తనవైపే  అలా .
రా  రా  రమ్మంటోంన్నది     కలల  రాకుమారి  నన్నలా .
అడుగడుగు   వేసేసి  నా  నడకే  సాగించాలే  నీకేసి .
ఒంటరిగా  నేనున్నాని  వలపుల  వర్షం  కురిపించేసి .
నీ  మమతల  భాంధవ్యాలనే  పంచిస్తావని  .
తపనగా  నీ  రాకకై  ఎదురు  చూస్తున్నానని
నీ రాకతో నా ఇల్లే ఓ బృందావనం
నీ సహచర్యమే అది ఒక ఆనందసాగరం
అలసిన నాకే ఓ సేద తీరము
నా భాదలను కరిగించే స్వర్గదామము
సర్వం నువ్వనిపించే ఊహల లోకము
Babu kandula Jun 2012
life ఏ reverse అయ్యింది నాలో స్పందన కలిగినాకనే
చంటి పిల్లాడిలా ఉండే నేనే చిత్రంగా మారిపోయానే
చలాకీగా ఉండే నాకేను చూ మంత్రం వేసేసిందే
నోట్లో వెలగపండు పడట్టే మింగుడు పడటంలేదే
ఓహ్ ఈ ప్రేమ దోమ వద్దు
ఈ పైశాచిక భాదలు వద్దు
నా పాలిట యమపాశం కావద్దు
నా దారిన నన్ను వదులు
నీకు ఈ జన్మకు కనపడను
కణికరిస్తావనుకుంటాను నాకు నా స్వేచ్చను నాకిస్తావని కలలే కంటున్నాను
కష్టం కాదే నీకు ఆలోచించే చూడు నీకేమైనా అందిస్తాను
కాళ్ళ వెళ్ళా పడతాను నా మనసే అందించి వెళ్ళేవరకు
అయ్యో పాపం అనిపించటం  లేదా  నా పై జాలి వేయటం లేదా నన్ను విడిచి వెళ్ళిపోవా
Babu kandula Jun 2012
ఎవరేమైన  అనుకోని  గమ్యం  భాటకు  గదితలుపులు  తెరిచేయి .
నచ్చిన  శైలిని  ఎంచుకుని  నీ  ప్రయాణం  మొద్దలుపెట్టవోయి .
పుట్టుకతో  ఎవరికీ  ఏమి  తెలియవే  సాధనతో  సంపాదించుతారే .
సంశయించకు సాహసం  లేని  చోట   విజయలక్ష్మి  ఉండబోదురా .
కష్ట  పడితే  ప్రతి  ఫలం   దానికదే  ఎదురోస్తుందని  తెలుసుకో .
సాదించగలనా    అనే  అనుమానంతో  సాగితే  అది  నీకే   భారంరా .
శాంతనంగా  ఉంటే  శుభ  గమ్యాలనే  చేరుకునే  అవకాశమే .
నీ  గమ్యానికి  కర్త  క్రియ  కర్మ  అన్ని  నువ్వే  అని  తెలుసుకో .
వేరొకరిని  తప్పుపట్టడం  మానుకుని  నీ  దృష్టిని   కేంద్రీకరించు  .
అంతులేని  ఫలితాల  సమాహారం  నీ  సొంతం  ఈ  పధ్ధతి   వింటే .
All is well.
Babu kandula Jun 2012
స్నేహమంటే  మాట్లాడే  మాటే  కాదు .
పాడుకునే  పాట  అసలే  కాదు .
అంతుచిక్కని  ఓ  మధురానుభూతి .
అంత కంతకు  మేలునే  కోరుకునే  స్థితి .
అందిపుచ్చుకోవాలి  అనిపించే  ఆశాజ్యోతి .
ఆకాశమే  హద్దుగా  సాగిపోయే  పయనం  అది .
అచంచలమైన  ఆరాట  పటిమతో  ఉండే  భందం  అది .
అహర్నిశలు  ఆడుతూ  పాడుతూ  ఉండేలా  ఉంచేది .
కల్లా  కపటం  లేని  కరుణామయ పరిస్థితి .
భాదలను  పంచుకునే  ప్రత్యాంన్యాయమే  కదా   ఇది.
Babu kandula Jun 2012
Love you అంటారే  నచ్చినట్టు  కనపడితే .
Hate you అంటారే  లెక్క  గాడి  తప్పితే .
Love కి  opposite hate అని  టక్కున  చెబుతారు .
నా  logic వింటే  ఎవరన్న  బెంబేలెత్తుతారే  .
Time ఎప్పుడు  నీదని  మురిసిపోకు .
నీ  గుణమే మారే  అవకాశం  వచ్చిందా  నీ  కొంపే  కొల్లేరు .
నీకు  నిట్ట  నిలువునా  పంగ  నామాలే .
నీ  attitude నచ్చే  వాళ్ళు  ఉంటారు .
మరి  అది  time to time change ఐతే .
చిరాకు  పడతారు  ఛీ  ఛీ  అంటూ  దూరం అవ్వుతారే  .
ఒక్కసారి  ముడిపడిందా  విడిపోవటం  కష్టములే .
ఇద్దరి  లోపాల  లొసుగులు  బయటపడతాయే .
సరిద్దుకోకపోతే   మొత్తం   తారుమారై  పోతుందే .
సర్దుకోకపోతే   సహజీవనం  శంకరాభరనములే  .
మునుముందుకు  సాగే  నడకలు  కుంటుపడతాయే .
మంచి  భాందవ్యాలు   బగ్గున   మండిపోతాయే .
ఈ  reasons తో  నా logic satisfy చేసానే .
మీకు  doubt ఉంటె  contact me prove చేసి  చూపిస్తా .
I will prove it for you.
Babu kandula Jun 2012
Oh అని  oho oho అని  
ప్రేమ  లేదని. . ప్రేమ  రాదని. .
దేవదాసు  అవ్వలేను .
మత్తు  పానీయాలు  తీసుకోలేను .
నా  రాత  ఇంతే  అని  సర్డుకోలేను .
తను  కావాలంటూ  గోలపెట్టలేను .
పూర్వపు  జ్ఞాపకాలను  గుర్తుపెట్టుకుంటాను .
నావల్ల  ఇబ్బంది  పడకుండా  చూసుకుంటాను .
Oh లే  oh లే  లే  లే .
నన్ను  విడిచిపోయింది  లే .
నాకు  కాకుండా  పోయింది  లే .
చిమ్మ  చీకటి  చేసి  వెళ్ళింది  లే .
విఫల  చరిత్ర  మిగిల్చింది  లే .
చెడు  రుచులనే  అందించి  పోయింది  లే .
Oh కొను  oh కొను  కొను  కొను .
నువ్వు  లేవని  నుయ్యి  గొయ్యో  చూసుకోను .
నన్ను  కోల్పోవటం  lucky  dip నే  miss అవ్వటం  అనుకుంటాను .
ఆయువునంత  వరకు  నిన్ను  నేను  మరచిపోను .
See you in my dreams and tell you bye in my reality అని అంటాను .
Oho oho భాదపడటం  వ్యర్ధం  అని  తెలుసుకో .
భాదించటం  మహాపాపం  అని  అర్ధం  చేసుకో .
నీ  భవితకు  పునాది  ముందు  నువ్వు  వేసుకో .
జరిడేది  జరగక  మానదు  అని  నీ  పని  చూసుకో .
Jun 2012 · 570
151.my gratitude to the GOD
Babu kandula Jun 2012
రాయాలనుకున్న  కవితలకే  అర్ధమయ్యే  శ్రుష్టి ని  కలిగించావు .
రంగురంగుల  జీవితంలో  నన్ను  పెట్టి  నిరంతరాయంగా  నడిపించావు .
నా  ఊహలకు   మూలం  నువ్వేను  నా  భాషకు   విలువలు  నువ్వయ్యేను .
రసమయ  భావనలు  నావ్వైతే  ప్రకృతి  రచనలు  నీవేను .
చిత్తసుద్దితో  నువ్వు  చేసినవన్నీ  నా  కవితలకు  భాగమయ్యేను .
నాకు  జ్ఞానం  అందిచిన  నీకే  నా  కవితలు   అర్పితము .
నా  తోడుగా  నువ్వుంది  నా  చేత  మంచి  కావ్యాలు  రాయిస్తావు .
విలక్షణ  శైలిని  అందించి  అంగరంగ  వైభవంగా  ముస్తాబుచేయిస్తావు .
నా  రాతలు  నీకు  నేన్నిచే  కానుకలై  నువ్వు  స్వీకరించు .
నీ  కీర్తిని  పొగిడే  సాహసం  చేయలేను .
ప్రతి  చోట  నువ్వే  ఉండిపోయి  అనంతంలా  కనిపిస్తున్నావు .  
అందుకే  నా  ఉడతంత  సాయంగా  నిన్ను  స్తుతిస్తున్నాను .
Babu kandula Jun 2012
ఒపేసుకోవే   చెలి  నాతోనే  ఉంటానని  నీ  ప్రేమ  అందిస్తావని  నా  నీడై  పోతావని .
నువ్వు  అవ్వునంటే  నాకన్ని  ఇష్టాలే   నువ్వు  కాదంటే  ఆణువణువూ   కష్టాలే .
నువ్వుంటే  నాకన్ని  విజయాలే . నువ్వు  ఎదురైతే  ప్రతి  రోజు  శుభాలే
నిన్నెంతో ప్రేమిస్తున్నానే మరీ. అందుకే ఇంతలా ప్రయాశ పడుతున్నానే చెలి
అవునంటావని ఏంటో ఎదురుచుస్తున్నానే. ఆరాటంతో అంతకంతకు నీ ప్రేమలో జారిపోతున్నానే
కరుణిస్తావని ఆశతో కళ్ళకు ఒత్తులు వేసుకుని చూస్తున్నానే
నా ప్రపంచం నీతో నిండిపోయిది కదే అందుకు ఈ తిప్పలు తప్పవు అంటోందిలే
ఐన పర్లా బరిస్తాను ఇవన్ని నువ్వు ఒప్పేసుకుంటానే
Babu kandula Jun 2012
వెంటాడుతున్న  ప్రేతత్మలా   వేదిస్తోంది  నా  గతమిల్లా .
నీ  ధర్మం  మరిచావంటు  కమ్ముతోంది  నీడలాగా.
మనసులోన  గందరగోళం  కలిగేలాగా  చేస్తోందిలా.
రెక్కలు  కొట్టుకుని  పోతోందే  నా  గమ్యం అలా .
ఎలా  పట్టుకుని  ఉంచను    అలా  పోతుంటే .
కృషి  అనే  మంత్రంతో  కట్టిపడేయాలే .
శ్రమ  అనే  సంకెళ్ళతో  బంధించి   పెట్టాలే.
వీటన్నిటికంటే  ఇష్టం  అనే  ముద్దుతో  మంత్రించేయాలే .
నిన్ను దాటి ఎక్కడికి వెళ్ళకుండా చేసేయాలే ఇలా.
Babu kandula Jun 2012
ప్రతి  నిమిషం  important అని  నువ్వు  తెలుసుకో .
ఆ  సంగతి  తెలిసిందా  నువ్వు  ముందుకు  go go.
వెనకడుగే  వేసావో  వెనకే  ఉంటావో .
నీ  గమ్యం  నిన్ను  విడిచి  ముందుకు  పోతుందో .
గడచినా  సమయం  తలిచావ  భవితకు  ఎలా  పోతావో .
గాడితపానంట్టు   చింతిస్తుంటే  గెలుపుకు  ఎలా  చేరుతావో  .
శ్రమ  నీ  ఆయుధమైతే  విజయం  నీ  భానిసరో.
ఆటంకాలు  లేని  జీవితమే  లేదులే   నీ  ప్రయత్నం  వదలకురో .
మంచిని  పంచే  గుణములతో  ముందుకు  సాగిపో .
నీ  కష్టం  ఒకటే  నీ  పెట్టుపడిరో .
ఫలితం  దేవుడి  చిత్తమురో  ఆ  మాటను  నువ్వు  మర్చిపోరో .
Babu kandula Jun 2012
చలిగాలి  తాకిందంటే  చలి  కాలం అంటారే .
వెండి  వానే  కురిసిందంటే  వర్ష  కాలం చూస్తారే.
మండే  సూర్యుడు  ఉన్నాడంటే  వేసవి తాపం ఉంటాదే.
నా  మనసనే  వీడిందంటే  అది  ప్రేమ  కాలం అంటానే .
నీ  చూపే  నన్ను  తాకిందంటే పుణ్య  కాలం అవుతుందే .
కలకాలం   నీతో  గడిపితే  అది  నాకు  సువర్ణ  కాలములే.
మేఘంలా నువ్వుంటే చినుకల్లే నేను మారుతానే .
ఆ చినుకల్లే చేరి నిన్ను తడిపేస్తుంటానే .
నాలో ఉన్న నిన్ను శ్వాసై చూసేసుకుంటానే .
నా ఆరోప్రాణం నువ్వే కదా మారి అల్లంత దూరాన ఉన్నావే.
నన్ను చేరేల నేను మార్పులు చేర్పులు చేస్తుంటానే .
Babu kandula Jun 2012
చలిగా  నన్ను  తాకే  నీ  ప్రేమే  అది  వేసవిని  తరిమే  శీతకాలమే .
ఆహ్లాదం  కలిగించే  వెన్నెల  వలపుల  వర్షం  కురిపించావే.
చక్కర  లాంటి  మాధుర్యం  నాకోసం  నువ్వే  రుచి  చూపించావే  .
పువ్వుల   పరిమళించే  వాసనలు  నాకే  అందించి  వెళ్లావే.
లాలీ  పాటలా  మారి  నన్ను  నిద్రపూర్చి   వెళ్తున్నావే .
వేకువే  కలిగించే  రవి  కిరణములై   నన్ను  చేరుతున్నావే .
నా  మనసు  అడిగే  ప్రశ్నకి  బదులే  నువ్వై  పోయావే .
నిన్ను  వీడి  ఉండలేక   ప్రాణ శిలలా  మారిపోయానే.
పగ్గాలే  చేపట్టమంటు  రాణి వాసమే   అప్పగిస్తున్నానే .
వద్దంటు  వేల్లిపోకిల  నీకోసం  వేచి  ఉంటానిలా .
సమయం  అనుకూలించే  వరకు  శాంతంగా  ఉండిపోతానులే .
Babu kandula Jun 2012
జీవనమే  ఆనందమయం  కాకపోతే  అడుగడుగు  కష్టాలే .
అకర్లేని  వాటిని  బుర్రకు  ఎక్కించి  భారాన్ని   మోయ్యొద్దు .
నీకు  కావలసినదేదో  అది  విశ్వాన్ని  నువ్వే  అడిగేసేయి .
పనికిరాని  వాటిని  వదిలి  నీ  అవసరం  ఏంటో  తెలుసుకో .
సదిమ్చాలేనిది  అంటూ  ప్రపంచంలో  ఏది  లేదు .
సహనంతోనే  ముందడుగు  వేసేస్తూ  ఉండాలి .
ఎప్పుడు  ఏం  జరుగుతుందో  ఎవరికీ  ఎరుకను .
కాలాన్ని  చూస్తూ  బయపడుతుంటే   ముందుకు  సాగేది  ఇంకెప్పుడు .
నీ  ఆలోచనలే  నిజమయ్యే  అవకాసం  ఉండనే  ఉందిలే .
మంచి  జరిగేల  మనసును  కోరే  తత్త్వం  తెలుసుకో .
నీ  మనుగడకు  అది  ఎంతో  ముఖ్యములే .
Babu kandula Jun 2012
ఓటమి  గాలి  శోకిందంటు   నిరుత్సాహ  పడకు .
పడుతులేస్తున్న  చిన్ని  పాపని  చూస్తూనే  ఉండు .
నడకలను  నేర్చుకునే   వరకు  అడుగుల  ప్రయత్నం  ఆపనే  ఆపదు.
గమ్యం  అంటే  చుట్టూ  తిరిగే  యంత్రం  అసలే  కాదు .
దానికి  తగట్టు  పనిచేయకపోతే  నీ వెనకే   రాదు .
నీ  శక్తి  విలువను  తగ్గించుకోవటమే   నిరుత్సాహము .
నిన్ను  నువ్వు  నమ్మితే  నివేనకే  రాదా  ఎలాంటి  విజయమైన .
గెలిచేందుకు  చూడు  నిన్ను  నీ  గిరి  దాటేవరకూ .
హద్దులే  చెరిపేసి  అంతులేని  గమ్యాలనే  నిర్దేశించు .
వాటిని  అందుకునేల  ప్రణాళికలనే సిద్ధం  చేసుకో .
నిన్ను  ఆపే  శక్తి  అది  నీ  మీదనే  అని  తెలుసుకో .
Babu kandula Jun 2012
అమావాస్యలే చీకటి అనిపించలా నువ్వు నాతొ ఉన్నప్పుడే
పున్నమి వెన్నెలైన చిమ్మ చీకటిల మారిందే నువ్వు విడిచి వెళ్లాకే
ఒంటరిగా ఉన్నా నీ జ్ఞాపకాలు నన్ను సవ్య సమాజంలో నడిపించాయే
అందరితో కలిసున్నప్పుడు నువ్వు లేని లోటు కళ్ళకు కడుతుందే
నీ శ్వాసల బరువులనే బరిస్తున్నానే
నీ నుదుటన సింధూరంలా నిలిచుండిపోయానే
నీ చెంపల రాలే కన్నీటి బొట్టులా మారిపోయానే
నీ జడ కొప్పులో మంధారంలా ఓడిగిపోయానే
నీ నవ్వుకే నే కారణమైపోయానే
Babu kandula Jun 2012
మనసు చెప్పుతోంది నిన్నే ప్యార్  కర్తాహే
దిమ్మాక్ కహతాహే అది ఆకర్షణ మాత్రమే
తుమ్ హారి సుందర్ ముహ్ చూసాక మైనే ఫిదా హోగయా
మై పాగల్ హోగయా ని ప్రేమలు కోసమే
నీతో bus లో travel చేసేలా తేజ్ సే దౌడ్ కర్తాహే
అపని నామ్ కేలియే మైనే చాలా చాలా కియా
తుమ్ హారి ఆంకో నే కనపడేలా కుచ్ కరుమ్గా
హౌలానే కాదే బంగారు happy  గా చూసుకుంటాను
doubt ఎందుకే సింగారు తుమ్ హారి రక్షనకవచ్ మైహూనా
late  ఏల వయ్యారి మైనే ప్యార్ కియా చెప్పెసేయి
Babu kandula Jun 2012
దేవుడు అంటే ఎక్కడుంటాడు ?పరలోకంలోనే ఉంటాడా ? పైనుంచి దీవిస్తుంటాడా ?
మనలో ఉంటాడే వాడు మన తోడుగా నీడగా వెను వెంటే ఉంటాడు
నీ ఆత్మకు పర్మాత్మలా కనిపిస్తాడు తన ఉణికిని కనిపెట్టడమే నీ గమ్యం అంటాడు
కళ్ళతో చూసేది నిజమని నమ్మేస్తుంటాము కనిపించనివన్ని అబ్ధాలే అని కొట్టి పారేస్తుంటాము
నీ కళ్ళకు ఎదురుగా ప్రత్యక్షం కాలేడు వాడినీ అందుకోవాలంటే ముందుకు సాగిపోవాలే
నీ మంచే కొరడు వాడు నీకు చెడునే అందించలేడు నీ కర్మలకు అనుగుణంగా నడిపిస్తుంటాడు
పాపం పుణ్యం మెట్లు నిర్దేసించుకునే హక్కు నీ ముందే వదిలి వెళ్తాడు
మనిషిగా నిన్ను మార్చేందుకు లోలోన ఉంది నీకు సందేశాలు పంపిస్తాడు
ఈ జన్మని మోక్ష సిద్ధికి చేరుకునేల చేసుకోమంటూ సూచనలు ఇస్తుంటాడు
Jun 2012 · 1.0k
140.i love you-i hate you
Babu kandula Jun 2012
i love you అన్న పదానికే నేడు అర్ధం తెలిసోచ్చిందే నీవల్ల
i hate you  అని నువ్వు అంటున్నా ఆగనంటోంది నా జన్మ
jolly గా తిరిగే మనిషిని కాస్తా road side romeo లా మారిపోయానే
love at first అంటే గిట్టనోడిని love లో పడిపోయానే
నా దారిన పోయేవాడిని నిన్ను చూసినాక ఆగిపోయానే
నీ పేరుకి అర్ధం తెలుసుకోవటానికి websites అన్ని search చేసానే
flames లో మన relation గురుంచి positive గా answer వచ్చిందే
love calculator మన ఇద్దరి బంధం గట్టిదని తేల్చిచెప్పిందే
జాతక చక్రాల మాట మరచిపోవే నా చెంతే నువ్వు చేరిపోవాలే
stars comets అంటూ separate చేయకే మహరాణిలా చూసుకుంటానే
colorful గా life ఉండేలా రోజపువ్వులనే రోజు present చేస్తానే
నీ కొచ్చే కష్టం ఏదైనా అది ఇష్టంగా నేను పంచుకుంటానే
happy గా ఉండేలా foundation వేసాలే planning  తో సిద్ధంగున్నానే.
Jun 2012 · 654
139.lovely lovely
Babu kandula Jun 2012
lovely  గా lock ఏ వేసావే అదేంటో ఎటు పోలేకున్నానే
చూపులతో గాలం ఎసావే మరి ఏంటో నీ కళ్లలో దాగుండిపోయానే
గుండె normal beat కి తెప్పించే  external  pulse  నువ్వు అయ్యావే
జివ్వంటూ current ఏ లాగుతోందే నీ నవ్వే నన్ను తాకుతుంటే
గులాబీ రేకుల్లాంటి నీ అధరములే తెనెలురూరుతు attract చేస్తున్నాయే
జీవంలేని ఆత్మకి నువ్వు ప్రాణం పోసినట్టు అనిపించిందే
పగలు రాతిరి నువ్వు అనిపించేలా నీ ప్రేమలో పూర్తిగా పడిపోయానే
మన బంధం శాశ్వతం అవ్వాలంటూ ముడుపులు ఎన్నో కట్టానే
నీతోనే నా గమ్యం అంటూ నీ వెనకే follow అవుతున్నానే
గోపికలాంటి ఓ బాలామణి శ్రీ కృష్ణుడిలా నిన్ను చేరుకుంటానే
శీఘ్రంగా మనం ఇద్దరం ఒక్కటయ్యే రోజుకే ఎదురుచూస్తుంటానే
Babu kandula Jun 2012
గుండె సూది లాంటి  చూపుతో గుచ్చుతున్నావే
వెన్నపూసలాంటి మనసుతో నా వెంట ఉంటావే
ధనస్సులాంటి కనుబొమ్మలతో బాణం వేసావే
పెదవి పలికే మాటలకి అందం నన్నే చేసావే
కన్నులు దాటి నువ్వు బయటకు పోను అంటావే
గండుపిల్లిలా నీవెంట పడేట్టు నన్ను చేస్తావే
కస్తూరిలా నీ నుదుటనే ఎప్పుడో  చేరిపోయావే
కలతలలో నీ తోడూ ఉంటానని హామీ ఇస్తానులే
నే కంగారులో ఉన్న నీ నవ్వు చూస్తే అది బేజారే
ఎండమావి లాంటి నాకు తొలకరి చినుకులా చేరావే
నా కష్టం అంతా నీ ప్రేమ ముందు మటుమాయమే
నీ దోస్తీ నాకు చేరిన నిమిషం నుంచి నేను కొత్త గా మారిపోయానే
నాకు ఇదో గొప్ప అదృష్టంగా బావిస్తూ ఉంటానే
ఆ దేవుడి శాక్షిగా నిన్ను విడిచి ఉండలేనే చెలి
Babu kandula Jun 2012
ఫలితం  లేని  పయనములు  ఎందుకని .
బూడిద  పాలు  చేసే  పన్నీరులే .
ఎండిన  మానుకి  నీరు  అవసరం  లేదని .
ద్వేషించే  చోట  శ్రమ  పడటం  ఎందుకులే .
బండను  కరిగించే  ప్రయత్నం  వ్యర్ధమని .
నీ  సమయం  విలువ  నువ్వు  తెలుసుకోవాలే .
జరిగిన  నష్టాలకు  గుర్తులు  ఎందుకని .
ఆలోచించటమే  పెద్ద  అనర్ధములే .
ఆవేశపడిపోవటం  మన  పని  కాదని .
నీ  దారి  ఏదో  అది  చూసుకుని  నడిచేయి
Next page