Submit your work, meet writers and drop the ads. Become a member
 
Babu kandula Dec 2012
ఒక్కసారే ఒక్క చూపే పడిపోయానే
చూస్తుంటే నాకేదో అవుతున్నదే
ఆకులే రోజా పువ్వులై పిలిచేస్తున్న భావనే
మబ్బులే నీ పేరుగా మారుతున్నాయిలే
ఆయస్కాంతమై నీవైపే లాగేస్తున్నాయిలే
చుట్టూ పక్కలే నీ పేరున వచ్చే రాగాలే
ఏ శ్రుతిలో ఉన్న నాకవి కమ్మని గీతాలే
ప్రతి అడుగు నీతో నడిచే అనుభూతులే
కాలం కూడా నీకోసం ఆగే వింతలే
నిదురంతా ఉండెనే నీ ఆహార్యం
నువ్వే రంగుల స్వప్నం అయ్యావే
నీతోనే సాగేనంత నా జీవనం
పలికిందే ఆకాశవాణి నా కల్లో
నీ జగ్రత్తలే నా పనులంటూన్నాయే
కాపాడేస్తా కష్టం నుంచి
రక్షించేస్తా రాతల నుంచి
Dec 2012 · 522
235. Something stopping me
Babu kandula Dec 2012
Something is rolling in my mind
I don't know why this happens every time
Every thought just makes me separate from the World
I don't want to be alone and be single in my World
I am waiting for the miracles to come
Some sort of pain in heart is waiting for the heal
Good days to come and good life to come
Struggling for the hope which is going to happen
That makes me feel wonderful.
Babu kandula Dec 2012
పల్లె చాటున అందాలే
తూర్పు దిక్కున సూర్యుని ఉదయాలే
పచ్చని పైరులు పందిరులే
ఆకు మడులతో నిండిన చందాలే
చెరుకు గడల తియదనమే
కొబ్బరి తోటలోనా సరదాలే
కాలువలోన చేసే సాహసాలే
కలువ పువ్వులతో నిండిన పరిసరాలే
ఒడ్ల గింజలతో అటుకుల ఫలాలే
స్వచ్చమైన గాలికి చిరునామే
పశుపక్షాదులతో నిలయాలే
పడమటి సంధ్యా రాగాలే
పొద్దు పొడిచే వేళల్లో చల్లటి కిరణాలే
భజనలతో సాగే వాతావరణం
పండుగ పబ్బాలు జరిగే ప్రదేశం
పల్లెల ప్రగతే దేశాభివృద్ధికి తార్కాణం
వాటి విలువలు ఎరుగారా మనుగడ కాపాడరా
Babu kandula Dec 2012
ఆవేశం హద్దులు ఉంటే నీ చేతుల్లో
అనురాగం అనుభంధం జీవితములో నీ సొంతమే
చిర్రెతేలా మాటలు ఉంటే చింతలు
నిన్ను చావు దెబ్బలు తీస్తుందే ..
చాకిరీ చేసే వీలుంటే నీ వాళ్ళకు చేసేయి
ప్రేమల మోతాదు పెంచేయి ...
మాట్లాడే మాటలు ముఖ్యం
చేతులతో చేసే సాయం
Fevicol భంధం మార్చేస్తుంది ..
అనుకోని మాటలు వదిలి
పరులకు భాదను మిగిలిచేకన్నా
రహస్యం దాచే ఓర్పు నీకుంటే
ప్రతి అడుగు సుఖమయమే ...
పరులకు ఆనందం నింపాలంటే
మనోభావాలను గౌరవించాలి
వారి సహనం బలహీనతని అనుకోకు
Relationship వదులుకోకు
Babu kandula Dec 2012
లాలిజో లాలిజో లాలిపాట పడుతున్న లాలిజో
Lovely ప్రేమ పంచుతున్నా లాలిజో
చందమామ రప్పించే  లాలిజో
చంద్రవంకతో లాలించే లాలిజో
అందమైన కలతో బోజ్జో
ఎన్నో అద్భుతాలు చూసే లాలిజో
కొత్త లోకం చుట్టే లాలిజో
మబ్బులు అవి కురిపించే జల్లులు
హరివిల్లుతో నిండిన లాలిజో
హరితవనమే హాజరుకాదా లాలిజో
Babu kandula Dec 2012
తాతలు రాసిన రాతలు
దేవుడి  కోసం అనుకోకు
సాయం  కోసమని చూడు
మంచిని  పెంచిన  నాడు
మన  బ్రతుకులు  కావా  స్వర్గధాములు
మనుగడే మన చేతిలో
మనసు మాట వింటుంటే
దాని భాటను పాటిస్తే..
అవరోధం అంటూ ఉంటేనే  
అది నీ ఓర్పుకే కాదా పరీక్షే
ఆనందం ముందుంది
నియంత్రనే చేస్తే
అవకాశం వదలకు
అధిరోహించే ఎవరెస్టు
Babu kandula Dec 2012
నా లాగా ఉండేది నేనేగా
నా కంటూ ఉనది నేనేగా
నా పాత్రకు న్యాయం చేసేది నేనేగా
నా గమ్యం భాటలు వేస్తోంది నేనేగా
ఎందరో నీ ముందు ఉన్న నీ జన్మకు నువ్వే సాటి
మహామహులే పుడుతున్నా నీకు రారు పోటి
ఆకాశంలా ఉండు మెరుపుకి తుఫానికి స్ధిరంగా ఉంటా
నాకంటూ తక్కువ లేరు నాకంటూ ఎక్కువలేరు
నేనే లేకుంటే చాలా పనులే ఆలస్యం అస్తవ్యస్తం
నన్ను నేను నమ్ముతూ  కించపరిచే భావన తీసేసేయి
Babu kandula Dec 2012
అరణ్యకాండలో ఆయుధ పూజలు చేసే వీరులే
దేశం కోసమని సాగే సమరమే
అక్రమ పాలకుల భరతం పడతమనే నినాదమే
పేదల పాలిట వరమంటూ పలికే భాష్యమే
అన్యాయం వెన్నె విరిచేస్తామనే నైజాములే
చీకటిలో చిరు దీపములా తిరిగే పంతమే
ధైర్యమే తమ తమ శక్తులై చేసే యజ్ఞమే
మానవజాతికి మేలునే కలిపించాలానే గొప్ప ఆశయం
స్వార్ధపూరిత భావన వల్లే కలుషితమవుతున్నా వైనమే
నియమావళిని దాటుతూ చేస్తున్న మారణహోమమే
సొంత ప్రయోజనాలతో దుర్వినియోగామవుతున్నా యాగమే
మార్పుకోసం ఎదురు చూపులే మనకున్నా మార్గమే
Babu kandula Dec 2012
కరుణా సాగరా సిలువను మోసిన మహానియుడా
రక్తం చిందించి పరిశుద్ధం చేసిన మహామహుడా
దేవుని రాజ్యము నుంచి మానవ రూపము దాల్చిన మా ప్రభువా
సహనంతో సాగి  మరణం జయించిన మా దేవుడా
నీ అడుగుల జాడలే మార్గదర్శకాలై నిలిచేను
నిత్య ప్రవక్తులు చెప్పి చైతన్యం చేసిన దేవుడా
కష్టాలా కారణభూతం నుంచి బయటకు రప్పించే కారణజన్ముడా
హింసకులోనై అహింసను చాటి చెప్పిన మహాత్ముడా
ప్రజల శ్రేయషు కోసం పాటుపడిన మహానియుడా
దరిచేర్చే వెలుగులతో చీకటిని అంతమొంద్దించే పరమాత్ముడా
ఈ జన్మ నీ భాతకు దాసోహం చరితార్డుడా
Babu kandula Dec 2012
ఎన్నో జన్మల వరమే ఈ జీవనం
అన్నే జన్మల కష్టఫలం
ఆ విలువనే గుర్తించి నువ్వు సాగరా
మంచినీ పాటిస్తూ ముందుకు దూకరా
ప్రతి జీవిపై ప్రేమను కురిపించి
చెలిమితో మెలిగేలా నువ్వు మారాలి
అశ్రద్దే చేసావా తగిన మూల్యం చెల్లించాలి
హింసలు వీడనాడి  అహింస భాతకు రావాలి
పరులకు ఇబ్బందే కలిగించే పధ్ధతి దూరం కావాలి
మంచిగా ఉంటావో  నిన్నే నువ్వు ముంచుకుంటావో నీ ఇష్టమే
కర్మల భారిన పడకుండా ఉండిపోవాలి
ఆదర్శం చూపించేలా నువ్వే మారిపోవాలి
Babu kandula Dec 2012
రాతలు రాసిన దేవుడే రాదాంతలు తొలిగే మార్గాలు చూపడా
రాక్షస జాతిని వధించిన భగవంతుడే నీ కష్టాల గీతలు చెరపడా
లోకాన్నే జయించినా ధీరుడే రేతిరి చీకటిపై జయభేరి మ్రోగించడా
కరుణకు రూపమైనా రాముడే కడగండ్లు నుంచి కాపాడడా
కాలసర్ప విషమును సేవించిన నీలకంటుడే కర్మల భాధను నయముచేయడా
భాగవతం చెపిన కృష్ణుడే భవితకు భాటలు నిర్దేశించడా
కలియుగ దేవుడైన శ్రీనివాసుడే కల్లా కపటం తెలియని వాళ్ళని రక్షించడా
విఘ్నాలను తొలగించే గణపతే ప్రకృతి వైపరిత్యాలు ఆపలేడా
భయాలను పారద్రోలే ఆంజనేయుడే హిమాలయం వదిలి బయటకురాడా
శాంతరుపుడైన సత్య సాయే శ్రద్ధగా పైనుంచి చూస్తుంటాడా
ఎవరి కర్మలకు ఎవరు భాధ్యులు
దేవుడు సైతం నిష్కార్ముడే  ఈ విషయములో
నీ కర్మబలం ముందు దైవబలం చిన్నబోవుగా
విశ్వదాభి రామ విన్నురా మామా
Babu kandula Dec 2012
రంగుల్లో ఉండే నీ రూపం కంటి పాపలకే విచిత్రం
నాపైనే నీ కోపం ఆ క్షణమే నాకు సంతోషం
నువ్విచే నవ్వులకి నే బదులుగా ఇచ్చే బంగారం
నీ తత్త్వం ఓ వరం దాన్నే పాటిస్తే నా ధర్మం
నీ ప్రేమే ఓ దీపం అందిస్తేనే ధన్యం
నీ పేరే నా పిలుపు పలికానంటే పరవశం
అతమినే జయిస్తా నువ్వు అవ్వునంటే నాకోసం
నీ జన్మే ఓ పరమార్ధం నేనుంటే అది చరితార్ధం
Babu kandula Dec 2012
తేరే మేరె దీవానా సాగాలి కావాలి సంతోషంగా
జిందగి మే నిన్ను చేరేందుకే నేను దయ చేసానా
ఆ feeling తో  అందుకే నేను నీ చుట్టే బొంగరం అయ్యానా
ముజ్కో క్యాహువాహై అనిపించేలా నీ అందానికి దాసోహమయ్యానా
కొత్తగా ఓ మల్లె తీగలా నా మనసునే నువ్వు కవ్వించావుగా
తడబాటుకే లోన్నవానా కోయిల స్వరముతో సందడి చేస్తుండగా
తుమ్హి దేఖోనా నాకేమయ్యిందో ప్రాణాలే నీ భానిసలుగా
ప్రాప్తాలే కాదా నీ పరిచయం ప్రారంభం నుంచే మరిపించావుగా
బుద్ధిని పెంచెను నీ సావాసం నాలో ఉన్న కళలకే ప్రేరేపనగా
నిన్ను చేరే నా మనసే కొత్త బంగారులోకాన్నే అనుభూతే చెందేనే
నీతో భంధం గట్టి భందనాలతో సాగేయాలనే తపనలే
అవిశ్రాంతంగా ఈ  ఆలోచనలే నీవైపే నా దారంటున్నాయే
Babu kandula Dec 2012
తిక మక మక తిక
ప్రేమలో చిత్రంగా మారే లోకము
కళ్ళకు అన్ని వింతలే
పగలే కనిపించే నక్షత్ర చంద్రులు
రేతిరిన ఉదయించే సూర్యులు
ఆకాశంలో ఎగిరే తరువులు
నేలంతా తిరిగే మబ్బులు
పైకంటూ ప్రవహించే సరస్సులు
గాలిలో తేలిపోయే రాయలు
లావాలనే చల్లగా మారేలే
మంచు పొగలే ఆవిరి పోరలాయనే
రంగులతో పువ్వులు కవ్వించే
వాడని శోభతో చుట్టూ ఉండిపోయెనే
వరాలపంటలే కురిపించేలా
నీ నవ్వు చందం నాకు తోడుగా నిలుచును..
గాలుల్లో తేలే ఇళ్ళ అందం
కనిపించేనే ప్రతినిమిషము..
ఈ ఊహలు హాయిలో నిరంతరం గడిపేస్తున్నానే..
Babu kandula Dec 2012
ఒక్కడైపోయే క్షణం చీకటులే కావా నేస్తాలు
నీకంటూ నువ్వుంటే నీలోకం నీదే ఆ సమయము
ఏకాంతమే సోపానం అనిపించే ప్రతిక్షణము
చిరు చిరు దివ్వెల జ్ఞాపకాలే మిగులు
జరిగిన కధలే కావా మధురాతి గురుతులు
ఏకాకి జీవితమే అలవాటుపడేలా మారుతుందే స్థితులు
ధీనంగా ఉంటే దేవుడు దిక్కు జీవనంలో నాకు అందే తోడూ
జగమంతా ఓవైపే ఉన్నా సరే మారలేని తత్త్వం ఉందే నాకు
నాకంటూ నేనే BOSS అవ్వుతాను నా ఇస్తాసరం ఉంటాను
Babu kandula Dec 2012
గీతం గీతం మనిషికి మూలం మూలం
ధర్మం తెలిపే మహత్తర గ్రంధం
ఆత్మే నిత్యం దాని వెనకే మన పయనం
మరణం అంటే మరో జన్మంటూ తెలిపే శాస్త్రం
నీలో పరమాత్మనే గ్రహించాలంటూ తెలిపే సారం
బ్రతుకంటే నీవెంటే సాగే సాగరం
ఎదురీదే లక్ష్యం ఉంటే జీవితమే కాదా దాసోహం
ఆ యోగ్యం సాధించాలంటే సాధనే ప్రత్యేకం
కలతలే నీకున్న ఓర్పుకు జరిగే పరిక్షలు
ప్రయత్నమే విడువకు నువ్వు ముందుకు సాగు
Babu kandula Dec 2012
రంగంలో నువ్వే ఉంటే నా ఓటమికైనా Vote వేసేస్తానే
నన్ను నేను కాల్చుకుంటానే నీ దారిలో వెలుగులు కావాలంటే
నా రక్తం నీకే ఇస్తానే నీ ప్రేమకు లేఖలు రాస్తుంటే
నీకోసం మొక్కులు కడతానే నీ అభీష్టం నెరవేరాలంటే
నువ్వు రాసే  Exams నాకు Important పూజలు చేస్తున్నానే
అష్టోతరం చదివించేస్తా  నవ్వులతో నీ జన్మ ఉండేలా
నీ ఆరోగ్య భీమ నేనంటూ నీ పేరున అభిషేకం చేయిస్తానే
Adaman కి వెల్లైనా నా ప్రేమ గొప్ప నీకు చూపించేస్తా
అంతుచిక్కని సాహసాలే చేస్తూ నా ప్రేమ Stamina Prove చేసేస్తానే
కర్తికా మాసం అమ్మయిలకైనా నీకోసం నిష్టలు పాటిస్తా
మనశ్శాంతి  నీకే కలగాలంటూ నీతో మాత్రమే మౌనవ్రతం చేస్తుంటానే
Babu kandula Dec 2012
నీ ముఖ చిత్రం చూసి పడిపోయా
చలనచిత్రం hero లా వెంటే ఉండిపోయా
నీ focus కోసం ఎన్నో trick లే వేస్తుంటా
నీ చూపే shift అయితే నిరుత్సాహాపడిపోతా
నీ చిన్ని నవ్వైన వెయ్యి volt bulb లా వెలుగుతుందే
నువ్వు ఉంటే నిమిషమైన యుగమంతా సంతోషమిస్తుందే
World Cup Win కన్నా నీ ప్రేమ గెలుపే నాకు మిన్నా
ఆశ్చర్యం కాదా నువ్వు చూసే చూపు
ఏ పక్కకు చూసినా నాకోసం అనుకోనా..
Arvind Swamy నీ కానే నేను Alexander అంతటి వాణ్ణి కనే చెలి  
ఓ మోస్తరు చూపులో ఉంటానే నేను అమితంగా ప్రేమిస్తానే నిన్ను
ఆటంకం ఎదురైనా ఆవేదన కలిగిన నిన్ను మర్చిపోనే మరీ
వెయ్యేళ్ళ వరమల్లె నా తోడుండిపోవే సఖి
Babu kandula Dec 2012
తప్పు నాదే తప్పు నాదే నీవెంటే పడుతోంటే
తప్పు నాదే తప్పు నాదే నీ ప్రేమే కావాలంటే
నిన్నే చూడాలంటే నీ permission కావాలి
నీతో మాట్లాడాలంటే నీ response తోడుండాలి
బహుశా నీ friend అవ్వాలంటే కొంచెం ఆప్యాయత చూపించాలి
ఏ చర్యా లేకుంటే నిన్ను నేను చేరలేనే
ఏ మాత్రం చలనం లేదంటే సాహసం చేయలేనే
petrol లాగా మనసును instant గా ఆవిరి చేస్తున్నావే
Water heater లాగా నీ వరసతో తనువంతా మంటెక్కిస్తున్నావే
ఎడారికి care of address లా ఎండల్లో నన్నే తిప్పించావే
వయతరని నదిలా ఒంటరిగా మిగిలానే
మదనపడేలా మహా మాయలా నువ్వు మారిపోయావే
Babu kandula Dec 2012
బ్రతికే  తీరే  ఆదర్శం .
కష్టాల మాటున  పయనం .
నామ మాత్రం  కానేకాని  పంతం .
నలుదిక్కుల  సాగే  నైజం .
లోపాలే  చిన్నబోయే  ప్రయత్నం .
పరులకు  చూపే  ధ్యేయం .
బ్రతుకు  విలువలు  చెప్పే  సాహసం .
చింతలు  తరిమే  యజ్ఞం .
చీకటింట  వెలుగుల  కిరణం .
నిశబ్ద  లోకంలోనూ  చేసే  సాయం.
నిరాటంకం  కావాలి  మీ  జీవనం .
ఎంతో  మందికి  కావాలి  స్పూర్తి  దాయకం .
సర్వమానవాలికి  మీరే  కావాలి  బలం .
మీ  శక్తి  యుక్తులు  అమోఘం .
ప్రఖ్యాతగాంచిన  మహామహులు  మీలో  ఎందరో .
నావల్ల  అవుతుందా  అనే  మాటకన్నా  నేనే  చేస్తానని  కదలాలి .
ఆశ్చర్యంలో  ముంచేయండి  ప్రపంచాన్ని .
Babu kandula Dec 2012
క్లిష్టతరం  కష్టతరం  కాదా  జీవనము .
అన్నదాతకు  సాయం   కరువైతేను .
ఉప్పు   పప్పుల   ధరలే   ఘోరము  .
దళారుల  పేరిట  మోసముల  భారముంటేను .
ఎగుమతుల  లాభాలే  దిగుబడుల  కర్చులతో  కానరావు .
వరుణుడి  తాపం  పంటల  నష్టం  దేవుడిపైనే  భారము .
నిత్యవసరాలే  నిత్య  గండాలుగా  మారెను .
రెక్కలు  కట్టుకుని  తిరిగే  ధరలు .
ఆకలి  అలమటలతో  ఆరోగ్యం  దూరము .
ఆప్పన్న  హస్తం  కోసం  ఆరాటము .
రైతే  రజని  అంటారు  ఆ  పేరే  మిగిలింద .
లేక  రాజుల   పాలనలు  అమ్తరిమ్చిపోయాయా.
భవితల  మంచికి  అన్నదాతల  రక్షణ  ముఖ్యము .
Babu kandula Dec 2012
తలచితే  పలికిన  ప్రేమ .
ఎడబాటుకే  అలసిన  నా  ప్రేమ .
కసిరితే  అలిగిన  ప్రేమ .
కన్నిల్లకే కరిగిన  నా  ప్రేమ .
ఊరు  పేరులే  మరపించిన  ప్రేమ .
దివినుండే   దిగి  వచ్చిన  ప్రేమ .
దోబుచులాడి  వెంట  ఉండే  ప్రేమ .
దేవతై  కురిపించిన  ప్రేమ .
వరములై  నన్ను  తాకిన  ప్రేమ .
నాలో  సగాభామై  ఉన్న  ప్రేమ .
నవ్వుల్లో  ముంచెత్తిన  ప్రేమ .
నడతలే  మార్చిన  ప్రేమ .
నయనం  అదిరే  ప్రేమ .
నా  ప్రాణం  ఈ ప్రేమ .
దండోరా  వేసే  ప్రేమ .
దడ దడలే  పుట్టించే  ప్రేమ .
విషమై  చేరిందా  ప్రేమ .
నీలకంతుడిలా  మారతానే  ప్రేమ .
కారుమబ్బులాగా  కమ్మితేనే  ప్రేమ .
నింగిలా   నిశ్చలంగా  ఉండిపోనా  ప్రేమ .
సంద్రంలాగా  ఉంటే  ప్రేమ .
చందమామలా  అలల  అడుపుచేయన  ప్రేమ .
Babu kandula Nov 2012
మనసే తెలిపే గీతం మౌనం లోను కాదా మధురం
మనసా నువ్వే మమతై ఉంటే మరుజన్మలలో నీతో జంటే కానా
వాత్సల్యం కురిపించే కళ్ళే వాసంతంలా నన్నే చూస్తున్నాయే
వరమై చేరే నీ బంధం వెలుగుల దీపంలా చేసిందే
దరిచేరే చీకటినే దాసోహమనిపించేలా మార్చేసిందే
మాయా లోకంలో నే మైత్రి భావంలో నీవేనకే పడుతున్నానే
మధ్యన నిలిచే హద్దులు చెరిపి మాటల గారడిలో ముంచేసేయి
మనోహరం దాల్చిన మన పరిచయం ముందుకు సాగించేయి
సంశయం ఎందుకే చామంతి పువ్వా గుండెకు రాణిగా చేసేయనా
దర్ఖాస్తులతోనే సిద్ధంగున్నాప్రేమను తెలిపే లేఖలతోనే
సమతిస్తే సరిగమల స్వరములా ఏడూ జన్మలు నీతోడుగా ఉండిపోనా
హారివిల్లై రంగులతో నిన్నే నింపేయనా
హారివిల్లై రంగులతో నిన్నే నింపేయనా
రాచ మర్యాదలే చూపించనా
రాబోయే కాలం నీతో ఆనంద పయనం చేయనా
Babu kandula Nov 2012
రహస్యం గుట్టుగా దాచిన విషయం.
గుప్తంగా మార్చిన తరుణం.
మంచిగా బ్రతికేతీరే మాయం.
దుఖాలను చెరిపే గాలికి దూరం.
అంతే తెలియని ఆ శక్తే తీరం.
చెంతే చేరిందా సుఖ శాంతులే లోకం.
కృతజ్ఞతలే నీ భాగ్యం మార్చే తియ్యని సంధ్రం.
చూసేందుకు చిన్నది అయ్యిన మెరుపల్లె
నీ భాగ్య రేఖ మార్చే బ్రహ్మాండ మంత్రం.
రుగ్మతుల నుండి రక్షా కవచం.
కలిగిన వాటికోసం సాగే కృతజ్ఞతా భావం.
జీవన విధానమే మనకు మెలి తిరిగే గమ్యం.
ఈ సారం గ్రహించిన నాడే సంతోషా సావాసం.
Babu kandula Nov 2012
గో గో గోవిందా నాపని గోవిందా
గెడ్డంతోనే గడపాలా
ప్రేమ మంటల్లోనే ఉండాలా
కనపడకుంటేనే  ప్రియా...
శత్రువునే  అయ్యానా
సాతాను పీడనా
వలపంటు వెంట ఉంటేనా..
రోధనే కలిగినా
ప్రేమించే గుండెకు
దూరంగానే ఉంటావా..
శ్రీ రాముడైనా రావణబ్రహ్మలైనా
హృదయ వేదనలకే కారా బలి..
నాకున్న బలమే నువ్వు
బలహీనతగా మారిపోకు..
శిలగా మరీనా రామచిలకా
సైగైనా చేసి శాసించవా
జీవిత కాలం కానా భానిసా..
Babu kandula Nov 2012
మనసే కలకలం దాని అదుపులే కీలకం
మనుగడలే పదిలం పాటిస్తేనే ఈ మంత్రం
చరితలో నిలిచిన చంద్రులు తమలో చీకటిని తుంచేసారే
లోక కళ్యాణమే తమ తమ ధ్యేయంగా శకము సాగించారు
మార్గదర్శకం కాకపోదా వారి వారి జన జీవనము
ప్రశాంతపు జీవితం కాదా మన సొంతము
ప్రాపంచిక జ్ఞానమే తారసపడిపోదా నీకు
తపనలే నీతోడై నిరంతర తపస్విగా మారిపోవా
నువ్వు సైతం ప్రపంచాగ్నికి సమిధమైపోవా
పరిపూర్ణ శక్తిగా సంఘ సంస్కర్తగా తయ్యారైపోవా
నీ ముందు తరానికి చిరు కాంతులీనే దీపమైపోవా..
Babu kandula Nov 2012
ఆకాశం నవ్వేసిందా..
మబ్బులతో మెరుపుల దాడి చేసిందా
నీ ఓటమి గుర్తులు తెలిసాకా ..
పర్వటమే అడుగడుగు అడ్డయ్యిండా
పెనుగాలై నిన్నే పాతరేసిందా
తడపడుతూ ఉన్నావంటే దొరికేయవా ..
చెట్టు చేమే చిర్రెతించిందా
కోకిల గొంతే కావ్వ్ అంటూ పలికిందా
ఇరుకునపడే అరహతలే పొందేయవా..
రాళ్లన్ని నీపై గురులే పెట్టేసాయా
మట్టంతా నిండుగా కప్పేసిందా
నీ కర్మలు నువ్వే మరిచావంటే..
వెలుగంతా నీ రూపం బయటకు చూపించిందా
నీ చీకటి సామ్రాజ్యాన్ని చిందరవందర చేసిందా..
ఊపిరికే   నువ్వు   కారణం
రంగుల ఊహలకే నువ్వే ప్రదీపం ..
ఎన్నెన్ని వెంటపడ్డా నీ గమ్యం నీకు సొంతం
ధైర్యంగా అడుగులేయి నీ భాటే నీకు ముఖ్యం ..
వెనువెంటే రాకపోదా విజయం
Babu kandula Nov 2012
గతము తరిమిన కాలం... (The time at which past threatened)
గుర్తు తెలియని ఈ భావం ... (Its a feeling that cannot be guessed)
చీకటింట నడపిన సమయం ..( I was made to travel in a dark house)
చిత్రంగా మారిపోదా పయనం ..( With a surprise my path has been changing..)
గవ్వలోన లేదు గమ్యం ... (My fortune is not in the stones)
గడువులోపు సాగితేనే జీవితం..( If I work with in the peak time its a life)
సాధనుంటే సమకూరిపోదా విజయం..( Practice helps me to the success)
సాహసమున్న చోట నిజమైపోదా స్వప్నం ..( Adventure is the source for the dream to come true)
శక్తి వంచన లేకుంటేనే వికాసం.. (If I keep hold on my energy that helps my development.)
సర్వ శాస్త్రాల పరిజ్ఞానమే సొంతం.. (Then its easy to learn every drop of knowledge)
hmm.. It seems awkward but, translation from Mother tongue to English is a bit difficult.
Babu kandula Nov 2012
కావేరి  కలువ  కాటుకతో  దాగున్నావా  
కవ్వుగిలికే  అందవా .
ముత్యాలతో  పోదుగున్నావా  
మురిపించే  అందంతో  
వల  విసిరేసావా.
బంగారంతో  సింగరంలో  ఉన్నావా  
బాహ్య  ప్రపంచాన్ని  మరిపించావా.
మనసులోనే  ప్రకంపనలు  ఎన్నో  కలిగించావా.
మధురమైన  వాణితోనే  తీరు  తెన్నులే  మార్చేసావా.
నువ్వు  పెంచే  దూరంతో  
క్షణము  ఒక్క  యుగములా  మారిపోయిందా .
రా  అంటూ  పిలిచే  నా  హృదయం  
రాగం  నువ్వై  ఉంటేనుగా .
లయలే  చేసే  శబ్దాలనే  
నీ  పేరులా పలికించానుగా .
రక్తమే  నిండిన  దేహమే  
ప్రేమతో  పూర్తిగా  చలనమే  లేకుండా పోయిందిగా .
జన్మనే  జాలిపడి పోయేలా  జతకట్టేలా
ఆ  జాడనే  కనిపెడుతున్నానుగా.
జోరుగా  సాగిన  నీవెంట  నా  పయనములు  
జాతకములకే  అతీతంగా  సాగిపోవ­ాలిగా .
సంకీర్తనలే  నీ పేరున  స్తుతించేలా
నీ  సాయమే  కోరుకుంటానుగా.
స్వప్నమే నువ్వుగా
నా సంపదే నీతో జంటగా
మనసున హాయిగా దాచుకుంటానుగా.
ఏ లోతులేని జీవితం  అందిస్తానుగా...
Babu kandula Nov 2012
కోతల పర్వ దినమే సంక్రాంతి
మంచి పంట చేతికందితే నిజమైనా సంక్రాంతి ..
ధర్మం గెలిచిన రోజులే దసరా దీపాలి
ఆ  ధర్మం నాలుగు పాదాలా పైనా ఉంటేనే మనకందరికీ దసరా దీపాలి..
ఏటా ఏటా వచ్చేది కాదుగా యుగాది
చరితలనుండి మనం మేల్కొన్న రోజునే అసలైనా యుగాది ..
మంటలతో సాగే పండుగ కానే కాదు భోగి
కష్టం కరిగి భోగం  పొందితేనే  ప్రతిరోజూ  భోగి..
శివ  పూజలు  చేసే  రోజు  కాదు శివరాత్రి
రుద్రుడి  ఆంతర్యం  అర్ధం  చేసుకుంటేనే  శివరాత్రి ..
కృష్ణుడి పేరున జన్మ దినం కోసం కాదు కృష్ణాష్టమి
గీతాసారం తెలుసుకోమనే ప్రయత్నంగా జరిగేదే కృష్ణాష్టమి...
పాడి పశువులు ఆరోగ్య సంరక్షణాల ప్రార్ధనలకే కనుమలు
జీవ హింసలనే విడిచి పెడితేనే అది నిజమైన కనుమలు..
Babu kandula Nov 2012
పోద్దులాగా  వెలిగిందా  ముద్దులాగా  ముంచిందా.
వేకువనే  వెన్నెల  కురిసిందా .
రాతిరిలో  వసంతం  ఎగసిందా.
వింతలతో  కలిసిన  కాలమా.
కలలతో  నిండిన  కలికాలమా.
లేదా  పరధ్యానంలో  మునిగిన  వైనమా .
మొరటుగా  మొండిగా  ఉండే  వాడిని  
మంచులా  సపంగి  పువ్వులా  తేలిక ­ అయ్యిపోయానే .
ముక్కలేనిదే  ముద్ద  దిగని  వాడిని  
ప్రతి  జీవిలో  ప్రాణం  చూస్త­ున్నానే.
ఒక్కరి  అంతరంగంతో  పని  లేకుండా  ఉండేతోడ్ని  
మనిషి  విలువలు  తె­లుసుకున్నానే .
సృష్టి  రహస్యం  ఏంటో  తెలియాలనే  
తపనతో  ఉవ్విల్లురుతున్నానే .
సత్యాన్వేషనే  పరమ  సోపానమని  తెలిసి  
దాని  వెంటే  వేలుతున్నానే .
నాకు  నేను  తెలిసినదే  
నా  జన్మకు  అర్ధం  గ్రహించినదే  
ముక్తి ­ వైపే  నా  పయనం  ఉంటాదే .
ఈ  జ్ఞానం  పంచే  వరకు  
నలు  దిక్కులు  ఏకామైనట్టు  ఉంటాదే .
శూన్య  స్థితిలో  దాగుండి  పోతానే .
Babu kandula Nov 2012
రాతిలా  నిలిచిన  రామ  చిలకమ్మా .
ప్రాణమే  పోయనా  రంగులే  అందించనా .
మాటలే  పలకని  మొహమాటమా .
మంత్రమే  వేయన  మంచిగా  బుజ్జగించనా.
దూరమే  తీరమై  సాగిందిగా .
నావపై  నీ  దరి  చేరనా .
నీ  కోపమే  భూగోలమంత   ఉందిగా .
చిన్నపాటి  నవ్వుతో  మాయచేయనా.
నీ  కరుణే  సముద్రమంత  లోతుగా .
అలల  నడుమున  నీకోసం  వచ్చేయనా.
మన్ను  పైన  కదిలాడే  సిరిసంపదవుగా .
Kohinoor కన్నా  మిన్న  నిన్ను  చేయనా .
Tajmahal లోని  శోభ  నీలోనుగా .
తేజ్ గా  నిన్ను  నా  వశం  చేయనా .
జయము  కోరి  నీవెంట  వచ్చానుగా.
జంకు  లేకుండా  ప్రేమ  సంపాందించనా .
తాంత్రిక  విద్యలైన  నేర్చుకోవాలిగా .
అహర్నిశలు  నువ్వు  నాతొ  ఉండేలానా .
దేవదారు  వృక్షం లాంటి  నిన్ను  చూడగానే .
నా  దేహమే  నీకోసం  బంధి  చేశా .  
ఆణువణువూ  నీ  పేరు  వినిపించేలా  నాలో  నేనే  మంత్రించేసానే  .­
ఈ  స్థితికి  నువ్వే  మందు  నా గతికి  నువ్వే  తోడూ .
Babu kandula Nov 2012
Recharge లేని  sim లోనే  love charge ఎక్కిం చేసావే .
Talktime తోనే  మాటలు  ఇచ్చి  validity గా  నీ  వలపే  కలిగించావే.
Mobile antenna కే  నీ  message frequency  తో  vibration తెచ్చావే .
Everytime signal ఉన్నటే  నీ  ఊహల videos అందించావే .
అంతే  లేని  offers  పెట్టి  జీవిత  కాలం  నీ  subscriber చేసావే .
Lifetime service అందించేలా  life అంతా భరోసా  పెంచావే .
Ring tone తో  నీ  call కనిపెడతాను  ఒంటి  tone  భట్టి  నీ  మనసు  చెబుతాను .
Balance card లు  ఎన్ని  అయ్యినా  నీ  ప్రేమ  తృప్తి  నాకు  తీరదులే .
భౌతిక   ప్రపంచాన్ని  మరచి  నీ  మాటలు  పూర్తిగా  వింటూ  ఉంటాను  .
నీ  ప్రశ్నల  చిక్కులు  విప్పి  నీ  నమ్మకాన్ని  కాపాడుకుంటాను .
Signal ఎ  తగ్గింద  tower   మీదుకే  ఎక్కి  reply ఇస్తాను .  
Speed గా  నీకు  reach అయ్యేలా  high data lines నే  పెట్టిస్తాను .
నిరంతరం  నా  ప్రసారాలే  నీకందేల  ప్రయత్నిస్తాను .
Babu kandula Nov 2012
Capacitor plate ల  మద్య  insulation  లా  నీ feelings దాచేసావే.
Diode forward bias లా  నీ  మనసు  చప్పట్లు  pass చెయ్యవే .
Zener reverse bias లా  నా  voltage stabilise చేసేయ్యవే .
Transistor regions లాగా  ముచ్చు  మూడైనా  stages లో  ఉన్నావే .
Cut చేసే  వీలుమ్డే  cut-off నుండి  బయటకిరావే.
మితిమీరే  అవకాశం  ఉండే  saturation నుండి  తప్పుకుపోవే .
Universal Acceptance లా  active stage  కి  చేరిపోవే .
Amplifier లాగా  నీ  ప్రేమను  సైతం  double triple అవ్వాలే .
ఎ  input లేని  స్పందించే  oscillator నా  heart అది  chese beat ఏలే  .
Infinite oscillations తో  నీవెనకే  నేను  నాతొ  నా  ప్రేమ .
నన్ను  control చేసే  feedback loop ఎ  నువ్వు .
నువ్వు  చెప్పింది  చేసే  circuit నేను .
Transistor లా  Switch అల్లే  మన  ఇరువురి  ప్రేమని  connect చేసేసే .
Babu kandula Nov 2012
ఆపదలకే ఆయువైనదా
ఆకాశంలో పిడుగులా మారిందా
తను విడిచిన నిమిషము
తలచిన ప్రతిక్షణములు
తన ఊహలు తాకిన దినము నాలోనే మదనము
రక్తంతో పేరు రాసి రాక్షస ప్రేమను చూపించనా
పువ్వులు నీకందించి వాటి ప్రాణములు హరించనా
కానుకలతో కబలించి నా ప్రేమ విలువలు తగ్గించనా
అందం ఊబిలొ పెట్టి జీవితాంతం నిన్నే బంధించనా
లేని పోనీ హంగులతో నిరంతరం నిన్నే మంత్రించనా
లేకా నాలాగా నిన్ను చూసుకోనా
నష్టమో కష్టమో నా లాగే నేన్నుంటా
నా శైలితో సాగిపోతా
వెను తిరిగి వచ్చావా నీ ఇష్టం లేదంటే నష్టం
నా ప్రతి అడుగులా నిన్నే చూస్తా
నా స్నేహం రుచులే చూపిస్తా
Babu kandula Nov 2012
Telepathy తో తేలికపాటి signals పంపిస్తున్నానే
Love frequency తో mapping అయ్యేలా జాగ్రత్త పడతానే
మన Energy levels suit  అయ్యేలా transducer పెడతానే
Distortion కలిగిందా carrier తోనే ముడిపెడతానే
Noise Effect తగ్గేలా Frequency Modulate చేస్తానే
Love signals అన్ని digitise  చేసిపరేస్తానే
Encryption చేసి మన data నీ Secure mode లో పెడతానే
Decode చేసేలా Synchronising Bytes సృష్టిస్తానే
మంచిగా డేటా అందేలా High Speed Media నే create చేస్తానే
Buffer use చేస్తూ Data Miss అవ్వకుండా Memory లో బంధిస్తానే
Files text లతో Final Love Data నీకే అందిస్తానే
Babu kandula Nov 2012
ముందు  వెనక  నువ్వే  
నా  పక్కన  ఉన్నది  నువ్వే  
నా  కోసం  వచ్చే­సావే .
కంట్లో  రూపం  నువ్వే  
వాకిట్లో  ఉన్నది  నువ్వే  
వలపే  కలిగించా­వే.
పూజించే  దైవం  నువ్వే  
పండగలకు  కారణం  నువ్వే  
వరములు  కురిపిం­చావే.
నవ్వుల్లోనూ  నువ్వే  
నడకల్లోను  నువ్వే  
నన్ను  నడిపించావే .
రాతిరి  కలవు  నువ్వే  
నా  రాతకు  అర్ధం  నువ్వే  
నవలోకం  చూపించ­ావే .
నారాయణ  మంత్రం  నువ్వే  
నాలో  ఆనందం  నువ్వే  
మైమరిపించేసావే  .­
వెన్నలగా  ఉంది  నువ్వే  
నక్షత్రాలను  మించింది  నువ్వే  
వెలుగుల­ు  చూపావే.
అయస్కాంతపు  శక్తి  నువ్వే  
ఆలోచన  వలయంలో  నువ్వే  
ఆకర్షణ  కలిగ­ించావే .
ఆత్మలా  నా వెనకే నీడలా
నన్ను కమ్మేసావే ...
Babu kandula Nov 2012
చొరవ  చొరవ  అది  మీరితేనే  గొడవ .
మితి  మీరి  మీరితేనే  చొరవ  చొరవ .
అర్ధంలేని  మాటలకే  ఆయువు  రూపములే  గొడవ .
అద్దంపట్టేల  అలజడుల  మద్యలో  స్నేహం  పడవ .
అంతే  ఎరుగని  అహంభావమే  ఈ  ధరువా .
నిలువునా  నీడను  దాచే  వింతైన  తరువా .
సరదాలను  మరచిన  సీతాకోక  చిలుకవా .
మనసే  మూగబోయిన  కమ్మని  కోయిలమ్మవా.
తలనే  దాచుకోలేని  ఇల్లులా  నువ్వే   మారిపోయినావా .
నన్ను  విడిచేలా  కంకణా లే    కట్టుకున్నావా.
కాళేశ్వరిలా  కణకదుర్గలా   కంట్లో  మంటలే  కురిపిస్తున్నావా .
దీపంలాగా  తిరిగి  నాకు  దిక్సూచనలను   ఇచ్చేస్తావని  తెగ  ఆరాటపడుతున్నానే  .
ఆవేదనగా  నీ కోసం  పయనిస్తున్నానే .
కంటికి  కనిపించేసి   కలతలు  కరిగించేయి   .
కాసేపైన  ఉండి  భాదలనే  మాయం  చేయి .
Babu kandula Nov 2012
అఖిల  చరా  చర  జీవనం .
జీవిత  పరమర్ధానికే  ఈ  పయనం .
అనుభవాలే  అనుకూల  మార్గం .
ప్రకృతితో  గడపబోయే  స్నేహం .
పండుగ  వాతావరణమే  ధ్యేయం .
శ్వాస  మీద  ధ్యాసలే  ఈ  సమయం .
సుదూర  ప్రాంతాలకే  చేరుతాం .
సహనమే  మనకు  సాయం .
సర్వరోగ  నివారిణి  కాదా  ఈ  నైజం .  
సుఖసంతోషాలు  కలిగే  పర్వదినం .
సానుకూల  స్థితి  కాకపోదా  ప్రతిక్షణం .
సదా  నీతోడు  కాదా  విజయం .
దాస్సోహమయ్యి  పోదా  ప్రపంచం .
Babu kandula Oct 2012
ప్రేమగా మారిన  ప్రేయసి  .
గుండెల్లో   గోదారై   పొంగినది . . .
తన  ఆచూకి  ఏంటో  తెలుపాలంటూ  
నా  మనసే  నన్నే  ప్రశ్నించింది .
ఏ దిక్కున  దాగుందో  తెలియకనే  
సంశయంలో  నేను  ఉన్నానే. . .
శతవిధముల   వెతికానమ్మ  
నీ జాడే  సాక్షి  కృతమే  అయ్యేలాగా .
సతమతమవుతూ  సుడిలో  పడుతూ  
నీ  దరికే  నా  ఈ  పయనం . .
దివ్యత్వం  నిండిన  కానుకవమ్మ  
నా  లోకంలో  వెలుగులు  నీతోనమ్మ . .
సంధ్రమంతా  సంగతులు  నీలో  ఉంటే  
ఓ  నీటి  బింధువే  నాకే  ఎరుక .
అభివ్యక్త  పరిచేలా  నీ  వలపులకే  నే  వేచినా...
నీతోడుగా  మరెందుక­ే  నే చూసినా..
Babu kandula Oct 2012
నా ప్రేమలు లోతుని ప్రశ్నించావంటే
బహుశా సాగరంలాగా కనిపిస్తుందని అనుకుంటాను
నా ప్రేమ యొక్క బరువెంత అని అడిగావంటే
శిఖరంలా దివిపైకే కనపడుతుంది అనుకుంటాను
ఆనందం కలిగించే అందమైన కలవంటాను
నీ కళ్ళల్లో కదిలాడే కంటిపాపను నే అనుకుంటాను
రెప్పలు ముస్తావో రంగుల లోకం చూపిస్తావో
ఆ నిర్ణయం నీకే వదిలేస్తున్నాను ..
నీ పెదవిలో రాలే ప్రతిమాట నేనే అనుకుంటాను
పెదవులు బంధిస్తావో స్వేచ్చగా బయటకి వదిలేస్తావో
అంటూ నీవైపే చూస్తున్నాను ..
శత్రువునైనా ప్రేమించే గుణమే నీదని అంటాను
నీ చెలికాడిగా నీ  వెనకే అడుగులు అంటాను ..
ఒక్క చిన్న నవ్వు వెలకట్టలేని బిడియంతో చక్క చక్క ఒప్పేసుకో
మన జంటనే మెచ్చేట్టుగా
జాతకాల నక్షత్రాలకు అతీతంగా
వేదం మంత్రాలా సాక్షిగా
జీల కర్ర బెల్లంలా కలిసిపోవాలిగా
ఏడూ అడుగుల మూడు ముళ్ళ బంధంగా ఒక్కటైపోవాలిగా
తదుపరి జీవితం మన ఇద్దరితో సాగిపోవాలిగా...
Babu kandula Oct 2012
ఆకాశంలో మెరుపల్లే అరా క్షణమే ఉంటావా
నక్షత్రంలో వెలుగల్లె రాత్రైతేనే ఉంటావా
హరివిల్లై ఎండా వానా వస్తేనే పుడతావా
సంద్రంలో కెరటంలా అనుకోకుండా ఎదురవ్వుతావా
పుచేటి రోజాలా ఒక్క రోజే ఉంటావా
నీ జాడే తెలియకనే తికమక పడుతున్నానే
నీ రూపం విలువలనే అంచనాలే వెయ్యలేనే
నిన్ను చేరే దారంతా ముల్లున్నా తాపిగా అడుగులేయనా
Babu kandula Oct 2012
స్పందనకు నిలయం నీ తలపే
స్వేచ్చకు చిహ్నం నీ చనువే
ఊరు వాడా తిప్పించే నీ ప్రేమే
ఓనమాలు దిద్దించే నీ పేరే
నీ కంటి సైగలే నా చిత్తం
ఆజ్ఞలు పాట్టించే నా సహనం
చిన్న స్పర్శతో చీకు చింతలు మటుమాయం
సాగరమే నువ్వా సాహసం అందించేయవా
గుండె లోతున నువ్వా గాయమే మనిపించవా
జ్ఞాపకాలా సామ్రాజ్యంలో మహా రాణివే నువ్వా
రక్త నాళాలలో ప్రతి బొట్టున్న నిలిచివా
శబ్ద తరంగాలలో సైతం కీలకం నీ స్వరమే
ఎందెందు వెతికిన నీవాయే ఎలోకాన చూసినా నీవాయే
నాకోసం దివినుండి దిగిన దేవతా ప్రతిమా...
Babu kandula Oct 2012
కల్లో  నువ్వే  ఇలలో  నువ్వే  కంటికి  కునుకు  నువ్వే  నువ్వే .
కన్నిటికి  మూలం  నువ్వే  కాలానికే  బదులు  నువ్వే  నువ్వే .
వేదించేనే  నా  మది  నన్నే  ఇలా  నీ  ఎడబాటు నే  కారణంగా చూపిస్తూనే పిల్లా.
శ్వాస  మీద  ధ్యాసే  మరిచానే  సంద్రంలోనే  మునిగిపోయానే .
సంతోషాల  తలం  జార  విడిచానే  విశాదంలోనే  మిగిలిపోయానే.
గమ్యం  భాటలు  బరువైనయే  భవితకు  మార్గం  కనుమరుగైనదే .
ఎంత భాద అయ్యినగాని నా మనసుకు ఏమి కాదు
బండ రాయిలాగా మార్చివేసేలే నాలో ప్రేరనే కలిగెనే
నిన్ను చూడకుండా నిన్ను తలచకుండా నీ ఊహల్లొ మిగిలిపోయెనే
రాయినైనా గాని నీ చేతి స్పర్శతో మనిషిలాగా మరగలనులే
సరస్వతి పుత్రుదిలాగా నీ పేరున సాహిత్యం రాయగలనులే
నా మనసు ఎరిగితే నే పడ్డ శ్రమకు ఫలితమే
కోటి ఆశలతో కరుణిస్తావని కోరుకుంటానులే
Babu kandula Oct 2012
రానుగా  నే  రానుగా  నీ  నుండి  విడిపోనుగా .
రాత్రైన  పగలైన  నీతోనే  ఉంటానుగా .
ఆకాశం  అంచులలో  మేఘాల  సాయంతో  నీ  వెనకే  ఉంటానుగా .
అంది  అందకుండా  గుప్తనిధిగా  భువిలోనే  దాగున్నావుగా.
నిధినే  వేటాడే  సాధకుడిగా  
నీ  జాడే  చేదిస్తానుగా  నిన్నే  సాధి­స్తనుగా .
గుడిలో  హారతిగా  దేవి  ప్రతిమలుగా  
నా  ముందే  మెరిసావుగా .
కల్లో  కానుకగా  ఇలలో  దీవనగా  
నాకే  నువ్వు  సొంతముగా .
వజ్రం  నువ్వే  వైడుర్యం  నువ్వే  
నా  నవ  రత్నములు  నువ్వేగా .
నక్షత్రం  రుపులోనే  నా  ముందే  నిలిచినావుగా .
ఆరాధన  కలిగేలా  ఆణువణువూ  నీ  హృదయలయలుగా .
ఆవేశం  తరిగేలా  ప్రతిచోట  హిమగిరిలా  నువ్వేగా .
అలసటనే  కరిగించేలా  అమృత  బిందువుగా .
నవ  ఉత్సాహం  పొందేలా  చేసావుగా.
నీ  ప్రేమే  తాకేలా  అనునిత్యం  ఆరతాన్నే  భరిస్తున్నానుగా.
ఆలోచించి  అవును  అంటూ  నాముందే  నువ్వే  వలిపోతవుగా .
అహర్నిశలు  నీకోసం  వేచి ఉంటానుగా .
Babu kandula Oct 2012
పెదవిపైన  నానుతున్న  తీయని  పేరే  నీదే .
కళ్ళల్లో  కదిలిన  మెరుపులా  తారక  నువ్వే .
గుండంతా  నిండిన  ప్రేమే  నీదే .
నాకోసం  లోలోన  దగున్నదే .....
రోజంతా  నీపై  ఉన్న  తలపే .
ఓ  అర donzen కలలకు కారణమాయే ...
ఆశ్చర్యంలో  ఉందే  మనసే  ఇలా.
ప్రతిచోట  నువ్వే  కనపడుతోంటే ...
ఆనాడు  ఈనాడు నా  ప్రేమలో  భేదం  లేనేలేదే .
పరిమితం  కాని ,, హద్దులు  లేని  చెలిమి  లయలే .
స్వాగతం  అంటూ  పిలిచేస్తున్నాయే .
నీలోని  ప్రేమని  అందుకోవటమే  నాక్కున్నా  ఎక్కైక  కర్తవ్యమే .
నదిలోన  నువ్వే  ఉన్నావంటే .
మశ్చవతారంతో నిన్నే  చేరుకుంటానే ....
భూదేవి  లాగ  నా  ప్రేమను  భరిస్తే .
నీ  భారం  మొత్తం  మోసే భాగ్యం  నాదేనంటా...
సుఖ  శాంతులే  మనం  కలిసుంటేనే .
ఆపైన  నిన్నే  నాకన్నా  మిన్నగా  చూసుకుంటానే  .
Babu kandula Oct 2012
కన్నీటి  చుక్కలతో  కావ్యాలే  రాయాలే .
వచ్చే  కష్టాన్నే  ఇష్టంగా  చూడాలే .
మనసును  పలికించే  భావాలే  రావాలే.
ఆ  భావన  వర్ణించే  వచనం కావాలే .
వేరెపుడుకాని  భాషలతో  అర్ధం  చెప్పాలే.
వందేళ్ళ  చరిత  ఉండేలా  నిలిచిపోవాలే .
ఆయువంత నీ  ఆశగా  అరచేత  రావాలిగా .
గుండెల్లోంచి  ఊహలు వెలిగే  దీపాలు  కావాలిగా.
అంతంటూ లేని  పయనంలో  మెరుపల్లే  సాగాలిగా.
వెచ్చించే  సమయముతో   కలిసొచ్చే  కవితనుకాన  .
కలలు  గలిపి  కాగితాలనే  పాటలుగా   మలచన .
ఆనందం  రూపాన్నే  అనుగుణంగా  రుచి  చూపాన .
Babu kandula Sep 2012
ప్రేమ ప్రేమ ప్రేమలోనా నా ప్రేమ
పాశమై నా దరిచేరే నీ ఎడబాటిలా
నా ప్రపంచం నీతో ఉందిలా
విడిచిన తరువాతే అరణ్యం అయ్యిపోయిందిలా
స్వప్నంలో నిన్నే కళ్లారా చూసానే
ఆ కలలే నేడు పీడిస్తున్నాయే
ఆకాసంలో మేఘం నువ్వే అనుకున్నానే
మెరుపల్లే మేఘంలోంచి దాడి చేసేశావే
కవ్వించే పాట నువ్వని తలచానే
కాటికాడ పద్యంలా మారిపోయావే
వెలుగులు చిమ్మే దేవత అనుకున్నానే
చీకటిని చూపే క్షుద్రకి అయ్యిపోయావే
ఆనందం నీ రూపమని  ఊహిస్తే
భాదలకే ప్రతిరూపంలా మార్చేసావే
Babu kandula Sep 2012
తర తర తారకలాగా
ఆకాశంలో మెరుపులాగా
ఆహ్లాదం కలిగించే హరివిల్లులా
నాకోసం వచ్చేసావే ..
జర జరా చిరుజల్లై కురిసావే
చామంతి పువ్వల్లె కలిసావే ..
గల గలా గుళ్ళో గంటల్లే నవ్వేసావే
గుండెల్లో ప్రేమ గంటె కొట్టేసావే
ఘాడంగా నా గూటిలో తిస్టేవేసావే ..
angel లా నువ్వే కనబడితే
మబ్బుల్లో నీ చిరునామా పట్టేసానే ..
చిరునవ్వే విసిరావంటే
కన్నీరైన కరిగిపోతుందే ..
కమ్మని సంగీతం
నీ స్వరమే నా చెవి చేరితే
రోజంతా సంతోషమే ..
ఓరకన్నులతో చూస్తూ ఉంటె
దాసోహం అంటుందే నా జన్మ ..
కోపంగా చూస్తూ ఉండిపోతే
గుండె ముక్కలై పోతుందే ..
నీ కష్టం ఏదైనా
అదీ నేనే అయినా
విడిచిపోయేలా చేస్తానే ..
నా వరకు నువ్వు మహారాణివిగా
నీ వెనకే  నీ సైన్యం నేనమ్మ ..
అడుగడుగు ఆపదలో తోడుంటానే
అయోధ్య రాముడిలా చూసుకుంటానే ..
నాతి చరామి అను మాటకు అర్ధం చూపిస్తానే
Babu kandula Sep 2012
మదిలో గదులే నీకోసం కట్టేస్తానే
మౌనంగానే ఉంటూ స్పందనలే ఇస్తానంటే ..
నా ప్రశ్నల తాకిడి అంతే లేదే
నువ్విచే బదులే మన సంబంధానికి శ్రీకారమే ..
నీ vote నా ప్రేమ గుర్తుకే అనుకుంటున్నానే
నాకున్న పెద్ద అస్తివి నాకోసం పుట్టేసావే
స్వేచ్చంటేనే నీతో అడుగులు వేస్తూ చక్క నడిచేయటం
life అంటే నీతో ప్రేమలో జీవించటం
ఆనందం అంటే నీతో గడిపితే కలకలం
ఊపిరి నువ్వనుకున్నానే ఊహల్లొ నిన్నే చూసానే
పరుగులు తీసే పయనం నీతో గడిపే సమయం
వర్షంలో గెంతే పాపలా నీ వెనకే పడుతున్నానే
ఆశ్చర్యం నా సొంతమే నా మీద చిరునవ్వు వదిలితే
కలగానైన నీతో ఉండే భాగ్యమే నే కోరుతున్నానే
కాసేపైన నీతో సాగే వెల్లువే కోటి జన్మల సంతోషం
come to me అని పిలిచే నా గుండె తలుపులే
wait చేసే వీలున్నదే time అనేది నీవెంటే
ఆరోగ్యభీమా నువ్వేలే ఆరోగ్యమే నీతోనే
ఆలోచనలే నీతోనే అంతిమంగా అది నీ చుట్టే
control చేసే switch నువ్వే remote car నేనేలే
సవ్యంగా నడిపిస్తావో direct గా accident చేస్తావో
ఈ నిర్ణయం ఉన్నది నీ చేతిలో
Next page