పల్లె చాటున అందాలే తూర్పు దిక్కున సూర్యుని ఉదయాలే పచ్చని పైరులు పందిరులే ఆకు మడులతో నిండిన చందాలే చెరుకు గడల తియదనమే కొబ్బరి తోటలోనా సరదాలే కాలువలోన చేసే సాహసాలే కలువ పువ్వులతో నిండిన పరిసరాలే ఒడ్ల గింజలతో అటుకుల ఫలాలే స్వచ్చమైన గాలికి చిరునామే పశుపక్షాదులతో నిలయాలే పడమటి సంధ్యా రాగాలే పొద్దు పొడిచే వేళల్లో చల్లటి కిరణాలే భజనలతో సాగే వాతావరణం పండుగ పబ్బాలు జరిగే ప్రదేశం పల్లెల ప్రగతే దేశాభివృద్ధికి తార్కాణం వాటి విలువలు ఎరుగారా మనుగడ కాపాడరా