పుట్టింట వెలుగులు చిమ్మిన దేవత
మెట్టినింట దీపం వెలిగించే తారక ,
అల్లారు ముద్దుగా పెరిగే పాప కదా
అత్తారింట పనులు చక్క పెట్టేలా మారే తీరుగా,
తప్పటడుగులు నేర్చిన చిన్ని బాలిక
భర్త కోసం వంద అడుగులకు పైగా వేసే ఓపిక ,
గోరుముద్దలు తిన్న బుజ్జి పాపాయి
ఇంటిల్లపాదికి వండేలా మారిన వైనముగా ,
ఆట పాటలు ఆడిన ఓ బుల్లి తనయా
అమ్మ అయ్యి పోయెను ఎంతో మధురముగా ,
ఆకలికి తాలని ఒక్క బుజ్జాయి
తన పిల్లల ఆకలి తీర్చేలా మారిన పెద్ద మనసు కదా,
పెద్దల నీడన పెరిగిన బంగారమే
నేడు పిల్లల పాలిట అయ్యేనే కల్పవృక్షముగా,
.................................
ఎంతో
ఋణపడిపోయేలా
ప్రతి ఒక్కరి హృదయాన
మీరంతా ఉన్నారు
మీ సేవలు అమోఘం
ఏ గొప్పలకు మీరు పోరు
రెక్కలు ముక్కలుగా
ఎంతో శ్రద్ధగా
ఎంతో కృషి చేస్తూ
మా కోసం మీరున్నారు
అలాగే మీ కోసం
మేముండేలా
అందరు పాటుపడాలని
ఆకాంక్షిస్తూ
ప్రతి తల్లికి
ఇదే నా హృదయపూర్వక
వినయముతో కూడిన
ఒక్క చిరు గేయము