తరంగిణి విద్యుత్తు శక్తల్లె తాకేసింది నా మనసే అదుపు తప్పేనే నీ కోసం పడిచచ్చిపోయెనే జాబిల్లై నువ్వు తాకితే జన్మంతా నీకు దాసోహమే జగడమే జరిగిపోద్దే నీ వెనకే ఎవ్వరన్న కానపడితే తీగలాగా కలిసిపోతా మల్లెలాగా వికసించినావో తీరు తెన్నులే మార్చుకుంటా నీ తపనకు సరితూగేలాగా తప్పుంటే మన్నించి రావే నీ కోసం తెగ వేచి ఉన్నా కళ్యాణం(శుభం) జరిగిపొద్ది కాసేపైన నువ్వు మాటలాడితే భాధలన్నీ పట్టాపంచలే నీ నవ్వే నేను చూస్తే వరమేదో నాకు దక్కే నీ స్నేహం దరిచేరినాకే మాట ఇచ్చి ఉండిపోవే నా జన్మే నీకై అంకితమే