ఒక్కడినై నే ఉన్నా ఊహలు తాకిన చోట ఇద్దరినేగా ఏకాంతంలోను నీ పేరున జరిపేను జపమేగా కళ్ళకు దూరం అయ్యావు కలలకు మాత్రం దగ్గర అయ్యావుగా మనసులు కలిసిన చోట మమతలు ఒక్కటయ్యేనుగా ఏమరుపాటులో ఉన్నాగాని నీ జ్ఞాపకాలే నాకు మేల్కొలుపుగా చూస్తూ ఉండి పోయేలా వింటూ ఉండిపోయేలా తన్మయమే గురిచేసావుగా