కాలుతున్న ఆహుతికి ఎందుకా మంటలని తెలుసునా వాడుకునే మనిషికి దాని ఉపయోగం తెలుసును కాలయత్ర చేసే మనసుకు దాని గమ్యం ఏంటో తెలుసునా లోన ఉండే పరమాత్మకే అన్ని విషయములు ఎరుకను మట్టిలో కప్పడిన గుర్తులన్ని చరితలుగా మన ముందు నిలచదా ధర్మం నిలబెట్టిన వీరుల గాధలే గ్రంధలై ఉండిపోవా గ్రహించగలిగిన రోజే జ్ఞానం పెంచుకొగలవు జగతుని ప్రేమించే దిశగా నువ్వు సాగిపోవా