Submit your work, meet writers and drop the ads. Become a member
Dec 2012
రాతలు రాసిన దేవుడే రాదాంతలు తొలిగే మార్గాలు చూపడా
రాక్షస జాతిని వధించిన భగవంతుడే నీ కష్టాల గీతలు చెరపడా
లోకాన్నే జయించినా ధీరుడే రేతిరి చీకటిపై జయభేరి మ్రోగించడా
కరుణకు రూపమైనా రాముడే కడగండ్లు నుంచి కాపాడడా
కాలసర్ప విషమును సేవించిన నీలకంటుడే కర్మల భాధను నయముచేయడా
భాగవతం చెపిన కృష్ణుడే భవితకు భాటలు నిర్దేశించడా
కలియుగ దేవుడైన శ్రీనివాసుడే కల్లా కపటం తెలియని వాళ్ళని రక్షించడా
విఘ్నాలను తొలగించే గణపతే ప్రకృతి వైపరిత్యాలు ఆపలేడా
భయాలను పారద్రోలే ఆంజనేయుడే హిమాలయం వదిలి బయటకురాడా
శాంతరుపుడైన సత్య సాయే శ్రద్ధగా పైనుంచి చూస్తుంటాడా
ఎవరి కర్మలకు ఎవరు భాధ్యులు
దేవుడు సైతం నిష్కార్ముడే  ఈ విషయములో
నీ కర్మబలం ముందు దైవబలం చిన్నబోవుగా
విశ్వదాభి రామ విన్నురా మామా
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
505
 
Please log in to view and add comments on poems