Submit your work, meet writers and drop the ads. Become a member
Nov 2012
కావేరి  కలువ  కాటుకతో  దాగున్నావా  
కవ్వుగిలికే  అందవా .
ముత్యాలతో  పోదుగున్నావా  
మురిపించే  అందంతో  
వల  విసిరేసావా.
బంగారంతో  సింగరంలో  ఉన్నావా  
బాహ్య  ప్రపంచాన్ని  మరిపించావా.
మనసులోనే  ప్రకంపనలు  ఎన్నో  కలిగించావా.
మధురమైన  వాణితోనే  తీరు  తెన్నులే  మార్చేసావా.
నువ్వు  పెంచే  దూరంతో  
క్షణము  ఒక్క  యుగములా  మారిపోయిందా .
రా  అంటూ  పిలిచే  నా  హృదయం  
రాగం  నువ్వై  ఉంటేనుగా .
లయలే  చేసే  శబ్దాలనే  
నీ  పేరులా పలికించానుగా .
రక్తమే  నిండిన  దేహమే  
ప్రేమతో  పూర్తిగా  చలనమే  లేకుండా పోయిందిగా .
జన్మనే  జాలిపడి పోయేలా  జతకట్టేలా
ఆ  జాడనే  కనిపెడుతున్నానుగా.
జోరుగా  సాగిన  నీవెంట  నా  పయనములు  
జాతకములకే  అతీతంగా  సాగిపోవ­ాలిగా .
సంకీర్తనలే  నీ పేరున  స్తుతించేలా
నీ  సాయమే  కోరుకుంటానుగా.
స్వప్నమే నువ్వుగా
నా సంపదే నీతో జంటగా
మనసున హాయిగా దాచుకుంటానుగా.
ఏ లోతులేని జీవితం  అందిస్తానుగా...
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
488
   ---
Please log in to view and add comments on poems