కోతల పర్వ దినమే సంక్రాంతి మంచి పంట చేతికందితే నిజమైనా సంక్రాంతి .. ధర్మం గెలిచిన రోజులే దసరా దీపాలి ఆ ధర్మం నాలుగు పాదాలా పైనా ఉంటేనే మనకందరికీ దసరా దీపాలి.. ఏటా ఏటా వచ్చేది కాదుగా యుగాది చరితలనుండి మనం మేల్కొన్న రోజునే అసలైనా యుగాది .. మంటలతో సాగే పండుగ కానే కాదు భోగి కష్టం కరిగి భోగం పొందితేనే ప్రతిరోజూ భోగి.. శివ పూజలు చేసే రోజు కాదు శివరాత్రి రుద్రుడి ఆంతర్యం అర్ధం చేసుకుంటేనే శివరాత్రి .. కృష్ణుడి పేరున జన్మ దినం కోసం కాదు కృష్ణాష్టమి గీతాసారం తెలుసుకోమనే ప్రయత్నంగా జరిగేదే కృష్ణాష్టమి... పాడి పశువులు ఆరోగ్య సంరక్షణాల ప్రార్ధనలకే కనుమలు జీవ హింసలనే విడిచి పెడితేనే అది నిజమైన కనుమలు..