పోద్దులాగా వెలిగిందా ముద్దులాగా ముంచిందా. వేకువనే వెన్నెల కురిసిందా . రాతిరిలో వసంతం ఎగసిందా. వింతలతో కలిసిన కాలమా. కలలతో నిండిన కలికాలమా. లేదా పరధ్యానంలో మునిగిన వైనమా . మొరటుగా మొండిగా ఉండే వాడిని మంచులా సపంగి పువ్వులా తేలిక అయ్యిపోయానే . ముక్కలేనిదే ముద్ద దిగని వాడిని ప్రతి జీవిలో ప్రాణం చూస్తున్నానే. ఒక్కరి అంతరంగంతో పని లేకుండా ఉండేతోడ్ని మనిషి విలువలు తెలుసుకున్నానే . సృష్టి రహస్యం ఏంటో తెలియాలనే తపనతో ఉవ్విల్లురుతున్నానే . సత్యాన్వేషనే పరమ సోపానమని తెలిసి దాని వెంటే వేలుతున్నానే . నాకు నేను తెలిసినదే నా జన్మకు అర్ధం గ్రహించినదే ముక్తి వైపే నా పయనం ఉంటాదే . ఈ జ్ఞానం పంచే వరకు నలు దిక్కులు ఏకామైనట్టు ఉంటాదే . శూన్య స్థితిలో దాగుండి పోతానే .