Submit your work, meet writers and drop the ads. Become a member
Nov 2012
రాతిలా  నిలిచిన  రామ  చిలకమ్మా .
ప్రాణమే  పోయనా  రంగులే  అందించనా .
మాటలే  పలకని  మొహమాటమా .
మంత్రమే  వేయన  మంచిగా  బుజ్జగించనా.
దూరమే  తీరమై  సాగిందిగా .
నావపై  నీ  దరి  చేరనా .
నీ  కోపమే  భూగోలమంత   ఉందిగా .
చిన్నపాటి  నవ్వుతో  మాయచేయనా.
నీ  కరుణే  సముద్రమంత  లోతుగా .
అలల  నడుమున  నీకోసం  వచ్చేయనా.
మన్ను  పైన  కదిలాడే  సిరిసంపదవుగా .
Kohinoor కన్నా  మిన్న  నిన్ను  చేయనా .
Tajmahal లోని  శోభ  నీలోనుగా .
తేజ్ గా  నిన్ను  నా  వశం  చేయనా .
జయము  కోరి  నీవెంట  వచ్చానుగా.
జంకు  లేకుండా  ప్రేమ  సంపాందించనా .
తాంత్రిక  విద్యలైన  నేర్చుకోవాలిగా .
అహర్నిశలు  నువ్వు  నాతొ  ఉండేలానా .
దేవదారు  వృక్షం లాంటి  నిన్ను  చూడగానే .
నా  దేహమే  నీకోసం  బంధి  చేశా .  
ఆణువణువూ  నీ  పేరు  వినిపించేలా  నాలో  నేనే  మంత్రించేసానే  .­
ఈ  స్థితికి  నువ్వే  మందు  నా గతికి  నువ్వే  తోడూ .
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
652
 
Please log in to view and add comments on poems