ఆపదలకే ఆయువైనదా ఆకాశంలో పిడుగులా మారిందా తను విడిచిన నిమిషము తలచిన ప్రతిక్షణములు తన ఊహలు తాకిన దినము నాలోనే మదనము రక్తంతో పేరు రాసి రాక్షస ప్రేమను చూపించనా పువ్వులు నీకందించి వాటి ప్రాణములు హరించనా కానుకలతో కబలించి నా ప్రేమ విలువలు తగ్గించనా అందం ఊబిలొ పెట్టి జీవితాంతం నిన్నే బంధించనా లేని పోనీ హంగులతో నిరంతరం నిన్నే మంత్రించనా లేకా నాలాగా నిన్ను చూసుకోనా నష్టమో కష్టమో నా లాగే నేన్నుంటా నా శైలితో సాగిపోతా వెను తిరిగి వచ్చావా నీ ఇష్టం లేదంటే నష్టం నా ప్రతి అడుగులా నిన్నే చూస్తా నా స్నేహం రుచులే చూపిస్తా