Submit your work, meet writers and drop the ads. Become a member
Nov 2012
చొరవ  చొరవ  అది  మీరితేనే  గొడవ .
మితి  మీరి  మీరితేనే  చొరవ  చొరవ .
అర్ధంలేని  మాటలకే  ఆయువు  రూపములే  గొడవ .
అద్దంపట్టేల  అలజడుల  మద్యలో  స్నేహం  పడవ .
అంతే  ఎరుగని  అహంభావమే  ఈ  ధరువా .
నిలువునా  నీడను  దాచే  వింతైన  తరువా .
సరదాలను  మరచిన  సీతాకోక  చిలుకవా .
మనసే  మూగబోయిన  కమ్మని  కోయిలమ్మవా.
తలనే  దాచుకోలేని  ఇల్లులా  నువ్వే   మారిపోయినావా .
నన్ను  విడిచేలా  కంకణా లే    కట్టుకున్నావా.
కాళేశ్వరిలా  కణకదుర్గలా   కంట్లో  మంటలే  కురిపిస్తున్నావా .
దీపంలాగా  తిరిగి  నాకు  దిక్సూచనలను   ఇచ్చేస్తావని  తెగ  ఆరాటపడుతున్నానే  .
ఆవేదనగా  నీ కోసం  పయనిస్తున్నానే .
కంటికి  కనిపించేసి   కలతలు  కరిగించేయి   .
కాసేపైన  ఉండి  భాదలనే  మాయం  చేయి .
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
475
 
Please log in to view and add comments on poems