అఖిల చరా చర జీవనం . జీవిత పరమర్ధానికే ఈ పయనం . అనుభవాలే అనుకూల మార్గం . ప్రకృతితో గడపబోయే స్నేహం . పండుగ వాతావరణమే ధ్యేయం . శ్వాస మీద ధ్యాసలే ఈ సమయం . సుదూర ప్రాంతాలకే చేరుతాం . సహనమే మనకు సాయం . సర్వరోగ నివారిణి కాదా ఈ నైజం . సుఖసంతోషాలు కలిగే పర్వదినం . సానుకూల స్థితి కాకపోదా ప్రతిక్షణం . సదా నీతోడు కాదా విజయం . దాస్సోహమయ్యి పోదా ప్రపంచం .