Submit your work, meet writers and drop the ads. Become a member
Oct 2012
రానుగా  నే  రానుగా  నీ  నుండి  విడిపోనుగా .
రాత్రైన  పగలైన  నీతోనే  ఉంటానుగా .
ఆకాశం  అంచులలో  మేఘాల  సాయంతో  నీ  వెనకే  ఉంటానుగా .
అంది  అందకుండా  గుప్తనిధిగా  భువిలోనే  దాగున్నావుగా.
నిధినే  వేటాడే  సాధకుడిగా  
నీ  జాడే  చేదిస్తానుగా  నిన్నే  సాధి­స్తనుగా .
గుడిలో  హారతిగా  దేవి  ప్రతిమలుగా  
నా  ముందే  మెరిసావుగా .
కల్లో  కానుకగా  ఇలలో  దీవనగా  
నాకే  నువ్వు  సొంతముగా .
వజ్రం  నువ్వే  వైడుర్యం  నువ్వే  
నా  నవ  రత్నములు  నువ్వేగా .
నక్షత్రం  రుపులోనే  నా  ముందే  నిలిచినావుగా .
ఆరాధన  కలిగేలా  ఆణువణువూ  నీ  హృదయలయలుగా .
ఆవేశం  తరిగేలా  ప్రతిచోట  హిమగిరిలా  నువ్వేగా .
అలసటనే  కరిగించేలా  అమృత  బిందువుగా .
నవ  ఉత్సాహం  పొందేలా  చేసావుగా.
నీ  ప్రేమే  తాకేలా  అనునిత్యం  ఆరతాన్నే  భరిస్తున్నానుగా.
ఆలోచించి  అవును  అంటూ  నాముందే  నువ్వే  వలిపోతవుగా .
అహర్నిశలు  నీకోసం  వేచి ఉంటానుగా .
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
461
 
Please log in to view and add comments on poems