Submit your work, meet writers and drop the ads. Become a member
Sep 2012
వినాయకా విజ్ఞేశ వినమృడనై నీకై అడుగేసా
ఆదిదేవుదవని అభయమిస్తావని అర్దిస్తున్నానే
మూషికవాహనుడా ముందుండి ప్రగతికి దిక్సూచిస్తావని
ఆపదల భారిననుండి రక్షణ కలిగిస్తావని
అజ్ఞానం నుండి విజ్ఞానికి దారిని మలచి
చీకటిలోన వెలుగులు చిమ్మే జ్ఞానదీపం వెలిగిస్తావని
నమ్మకంగా నికే నన్ను అర్పిస్తున్నానే
అజ్ఞాతంలో దాగున్నా వికాసానికి స్పందన కలిగించేయి
ఏదో చేయాలనే ఆరాటంతో సాగేలా దీవించేయి
నా ఉనికే తెలిసేట్టు జయములతో నన్ను స్వాగతించూ
ఏకదంతుడవని మహాభారతం రాసిన మహోన్నతుడవని
నా జీవిత రచనలకు అర్ధం చూపించేయి
బుద్దిని పెంచుతూ బుద్దుడ్ని చేసేయి
మంగళం పలికి కళ్యాణం చేసేయి
సుభాప్రధమే జీవితం అయ్యేలా దీవించేయి
ప్రతిదినం ని నామస్మరనే నాకు దిక్కు మొక్కులే
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
504
 
Please log in to view and add comments on poems