Hello ~ Poetry
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2024 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Babu kandula
Poems
Sep 2012
179.sai ram ki jai
షిరిడి సాయి నాధా
శివునికి రూపమని
రాముని అంసవని
యేసులో కరుణవని
అల్లాకే ప్రతిరూపమని
నిన్నే కొల్చుతున్నానే......
శరణు కోరే శత్రువుకైన ప్రేమని పంచె మహాత్ముడవని
జాలిని కురిపించే నిత్య సంతోషరూపమని
జనుల కోరికలు తీర్చే కల్పవృక్షమని
మనసారా నిన్నే స్తుతిస్తున్నానే.....
భిక్షాటన చేస్తూ వారి వారి పాపములు మోసే దీనబంధువని
రుగ్మతులు తొలగించే వైద్యరూపదారుడవని
కటిక చీకటిని కడతేర్చే కరణజన్ముడవని
సద నీ నామ స్మరణలో మునిగిపోయెనే....
అనంత జ్ఞాన సాధనకు నువ్వే శరణం
ఇహలోక గమ్యాలకు నువ్వే ఆధారం
ముక్తిని పొందే మార్గానికి ప్రధమం
ఆత్మ జ్ఞాన సొంతానికి నువ్వే మూలం
సృష్టిలోని జీవులకి నువ్వే సర్వం .....
కాలమే నువ్వేనోయి మా కర్మలే నీవేనోయి
వేద పాఠాలన్ని నీ మాటలలోయి
నీ పాదాల చెంతే గొప్ప క్షేత్రమోయి
గంగా యమునలు నీ మాటకు లోబడి ప్రవహిస్తాయి
శ్రేష్టమైన వాక్కులుంటే అది నీ పేరే సాయి
రాతిలాంటి మమ్మల్నే మనిషిగా మార్చేయి
జన్మలు అన్ని సార్ధకం చేసేయి
మనిషుల మనసులే సుద్దె చేసి
జీవితాలనే చరితార్ధం చేసేయి .....
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
శ్రీ సచ్చిదానంద సదుగురు సమర్ధ సాయి నాధ్ మహారాజ్ కి జై
Written by
Babu kandula
Des Plaines, Illinois
(Des Plaines, Illinois)
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
716
Please
log in
to view and add comments on poems