ఇదేమ్ లోకమో సెల్లులతో సావాసం వినికిడికే లోపమా ఈ ప్రభావం నిదురకే భంగమా ఈ యుగం మనసులో ముళ్ళులే ఈ భారం కళ్ళకే కష్టమా ఈ ఉపకరణం ధ్వని తరంగాలే ముఖ్యమా ఈ పయనం దూరాలే తరుగునా ఈ సౌకర్యం అత్యవసర పరిస్తితులకే ఆవశ్యకం నిన్ను వీడని తోడులా నీవెంటే అందరం జాడను తెలుసుకునే అవకాసం నిరంతరం నిత్యావసర వస్తువుగా మలిచిపెట్టేసారే మొబైల్ ఫోన్ లే జీవితంగా మార్చేసారే ప్రాధాన్యతలే పెంచుతూ కృత్రిమ యమపాశాన్నే మోస్తున్నారే దిన దిన గండంగా బ్రతుకులే అయ్యిపోయాయే