పాపంరో పాపా బంగారు చేప నా దారికే అడ్డురాకా సయ్యి అంటూ సిలక సరదాల సాకా నా వెనకే పడకా పోపోవే బాలా పొయ్యి మీద కాకా రారాకా నాపైకే నువ్వలా గుమ్మంది పుష్పంలా గుబాళించే వాసనలా నా వరకు రాకా చంద్రుడ్ని చుట్టే రేతిరిలా సూర్యుడ్ని కమ్మే మబ్బులా కబళించకలా వసంతంలో కాచే ఎండలా హేమంతంలో ఉండే రోజులా నన్ను చేసేయకలా పాటలు పాడే కోయిలై ప్రేమను పంచే దేవతై నా ముందే ఉండకలా కొమ్మల్లో దాగిన కాయలా మేఘంలో ఉన్న చినుకులా దాగుంది నాతో ఆడకలా ఏం పాపం ఎరగని వాడినే కల్లాకపటం తెలియని బాలుడినే కష్టాలభారిన పెట్టకే కరిగిపోయే మంచునై కాళ్ళకింద నీరులా నన్ను మాత్రం చేయకే అలా ఎలా