గోకులంలో గోపెమ్మలా గౌరీ పూజలో సుమధుర మంధారమా రేపల్లేలో రాధమ్మలా రత్నాల మాలికలా ఉన్నావమ్మా నింగి నేల నీలాగా నవయవ్వనం గా కనిపిస్తుందే నీ మనసు మమతలు కోసం నేనే వేచి ఉన్నానే వయారంగా ఉన్నా నిన్నే వదువుగా మార్చి జత కట్టాలే రోజా పువ్వులా రోజు వీస్తున్న నిన్నే రోజు చూడాలి రామాయణ కావ్యంలా మధురంగా నువ్వు ఉన్నావే గాలి వానలు ఎదురైనా నా గమ్యం అయిన నిన్నే చేరుతానే గుబాళించే వాసనకు చిరునామాగా నిలిచింది నువ్వేలే గంధం పసుపు పూసిన కుంధానపు బొమ్మ నువ్వేలే కంటికి ఇంపుగా కనపడే అందామా నువ్వేనా సర్వములే సాయంత్రాన వెలిగే వెలుగులు అవి నీ నవ్వులులే నాకు వికాసం పెంచే అభివృద్ధి పధకంలా తగిలావే నిప్పులా రాజుకున్న ప్రేమకే నిలువెత్తు సాక్ష్యం నువ్వే ప్రేమ అర్ధం చేసుకుని నా ఆరాధననే స్వీకరించేయవే ప్రియ.