రాయాలనుకున్న కవితలకే అర్ధమయ్యే శ్రుష్టి ని కలిగించావు . రంగురంగుల జీవితంలో నన్ను పెట్టి నిరంతరాయంగా నడిపించావు . నా ఊహలకు మూలం నువ్వేను నా భాషకు విలువలు నువ్వయ్యేను . రసమయ భావనలు నావ్వైతే ప్రకృతి రచనలు నీవేను . చిత్తసుద్దితో నువ్వు చేసినవన్నీ నా కవితలకు భాగమయ్యేను . నాకు జ్ఞానం అందిచిన నీకే నా కవితలు అర్పితము . నా తోడుగా నువ్వుంది నా చేత మంచి కావ్యాలు రాయిస్తావు . విలక్షణ శైలిని అందించి అంగరంగ వైభవంగా ముస్తాబుచేయిస్తావు . నా రాతలు నీకు నేన్నిచే కానుకలై నువ్వు స్వీకరించు . నీ కీర్తిని పొగిడే సాహసం చేయలేను . ప్రతి చోట నువ్వే ఉండిపోయి అనంతంలా కనిపిస్తున్నావు . అందుకే నా ఉడతంత సాయంగా నిన్ను స్తుతిస్తున్నాను .