Submit your work, meet writers and drop the ads. Become a member
Jun 2012
చలిగాలి  తాకిందంటే  చలి  కాలం అంటారే .
వెండి  వానే  కురిసిందంటే  వర్ష  కాలం చూస్తారే.
మండే  సూర్యుడు  ఉన్నాడంటే  వేసవి తాపం ఉంటాదే.
నా  మనసనే  వీడిందంటే  అది  ప్రేమ  కాలం అంటానే .
నీ  చూపే  నన్ను  తాకిందంటే పుణ్య  కాలం అవుతుందే .
కలకాలం   నీతో  గడిపితే  అది  నాకు  సువర్ణ  కాలములే.
మేఘంలా నువ్వుంటే చినుకల్లే నేను మారుతానే .
ఆ చినుకల్లే చేరి నిన్ను తడిపేస్తుంటానే .
నాలో ఉన్న నిన్ను శ్వాసై చూసేసుకుంటానే .
నా ఆరోప్రాణం నువ్వే కదా మారి అల్లంత దూరాన ఉన్నావే.
నన్ను చేరేల నేను మార్పులు చేర్పులు చేస్తుంటానే .
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
513
 
Please log in to view and add comments on poems