చలిగా నన్ను తాకే నీ ప్రేమే అది వేసవిని తరిమే శీతకాలమే . ఆహ్లాదం కలిగించే వెన్నెల వలపుల వర్షం కురిపించావే. చక్కర లాంటి మాధుర్యం నాకోసం నువ్వే రుచి చూపించావే . పువ్వుల పరిమళించే వాసనలు నాకే అందించి వెళ్లావే. లాలీ పాటలా మారి నన్ను నిద్రపూర్చి వెళ్తున్నావే . వేకువే కలిగించే రవి కిరణములై నన్ను చేరుతున్నావే . నా మనసు అడిగే ప్రశ్నకి బదులే నువ్వై పోయావే . నిన్ను వీడి ఉండలేక ప్రాణ శిలలా మారిపోయానే. పగ్గాలే చేపట్టమంటు రాణి వాసమే అప్పగిస్తున్నానే . వద్దంటు వేల్లిపోకిల నీకోసం వేచి ఉంటానిలా . సమయం అనుకూలించే వరకు శాంతంగా ఉండిపోతానులే .