అమావాస్యలే చీకటి అనిపించలా నువ్వు నాతొ ఉన్నప్పుడే పున్నమి వెన్నెలైన చిమ్మ చీకటిల మారిందే నువ్వు విడిచి వెళ్లాకే ఒంటరిగా ఉన్నా నీ జ్ఞాపకాలు నన్ను సవ్య సమాజంలో నడిపించాయే అందరితో కలిసున్నప్పుడు నువ్వు లేని లోటు కళ్ళకు కడుతుందే నీ శ్వాసల బరువులనే బరిస్తున్నానే నీ నుదుటన సింధూరంలా నిలిచుండిపోయానే నీ చెంపల రాలే కన్నీటి బొట్టులా మారిపోయానే నీ జడ కొప్పులో మంధారంలా ఓడిగిపోయానే నీ నవ్వుకే నే కారణమైపోయానే