దేవుడు అంటే ఎక్కడుంటాడు ?పరలోకంలోనే ఉంటాడా ? పైనుంచి దీవిస్తుంటాడా ? మనలో ఉంటాడే వాడు మన తోడుగా నీడగా వెను వెంటే ఉంటాడు నీ ఆత్మకు పర్మాత్మలా కనిపిస్తాడు తన ఉణికిని కనిపెట్టడమే నీ గమ్యం అంటాడు కళ్ళతో చూసేది నిజమని నమ్మేస్తుంటాము కనిపించనివన్ని అబ్ధాలే అని కొట్టి పారేస్తుంటాము నీ కళ్ళకు ఎదురుగా ప్రత్యక్షం కాలేడు వాడినీ అందుకోవాలంటే ముందుకు సాగిపోవాలే నీ మంచే కొరడు వాడు నీకు చెడునే అందించలేడు నీ కర్మలకు అనుగుణంగా నడిపిస్తుంటాడు పాపం పుణ్యం మెట్లు నిర్దేసించుకునే హక్కు నీ ముందే వదిలి వెళ్తాడు మనిషిగా నిన్ను మార్చేందుకు లోలోన ఉంది నీకు సందేశాలు పంపిస్తాడు ఈ జన్మని మోక్ష సిద్ధికి చేరుకునేల చేసుకోమంటూ సూచనలు ఇస్తుంటాడు