మనిషికి విలువ డబ్బుతోనే . మమతకు విలువ మంచి మనసుతోనే . మంచి మనసున్న మనిషేదే . జీవితం వెలుగులు చూపించే నాధుడు ఏడే. అయ్యో పాపం అన్నావ అంతా భారం నీ మీదే . అహం అనే మాటే లేకపోతె నీ పని అధోగతే . పోనిలే అని సాయం చేస్తే వంకలు తప్పవులే . మంచికి పొతే చెడు స్వాగతం పలుకుతుందే . ............................................... కలి కాలం కష్టాల తోరణం కట్టి పిలుస్తుందే . నువ్వెంత చేసిన అది కొసరు వరకే . నీ పనులు బరువయ్యే ప్రమాదము లేకపోలేదు . ఐన్నా సరే పలువురికి మంచి చేస్తే ధర్మం కదా . అవసరమైన వాలకి తోడు నీడ గా ఉండాలిగా . చేదోడు వాదోడై ఉండి అందర్ని కాపాడుకోర . నీ ఆశయ సిద్ధి కి ఇది ఒక తోడ్పాటే. మంచిని పంచి మమతల కోవెల కటిన్చాలే . నీ మార్గం మెచ్చి ప్రజలందరూ నీ అడుగులు అనుసరించాలే .