ఆణువణువూ అణువులతో చేసాడే నన్ను . ఏ చిన్న తేడ ఉన్న అది మచ్చుకే . వనరుల మద్య ప్రతిఘటనలే కీలకం . రక్తంతోనే ప్రాణ వాయువు అందిస్తాడు . విద్యుత్తూ శక్తితో నన్ను నడిపిస్తాడు . పంచ భూతాలనే నాలో ఇమిడించాడు . మట్టి తోనే నా రూపం దిద్దాడు . వాయువు తోటే నాకు ఆయువు పోసాడు . నీళ్ళతోనే నన్ను నింపేసాడు. అగ్గితో నాకు దహించే గుణమిచ్చాడు . ఆకాశంలా నాకు మాద్యం ఇచ్చాడు.