ఈ మాయలో నీ మాటలో నే పడిపోయా . నా గమ్యము నా జీవితమూ ఏంటో మరిచా . పలువురు తిట్టినా ఉలుకు పలుకు లేదు నాలో . గొడవల్లో ఉండే నన్ను నేనే పూర్తిగా మార్చుకున్నా . అర్థం పర్ధం లేని ఆలోచనలలో నే మునిగే ఉన్నానే . అయ్యో పాపం అనుకునేలా నా తిరు మారిందే . అహో రాత్రులు నీకై నేనే కల కంటున్నా . ఏం పాపం చేసానో నీ దర్శనం నాకు కరువయిందే . గ్రహణం పట్టిందో ఏమో నాకు నువ్వే దూరం అయ్యావే . కాల యాతనకై నే వేచి ఉన్న కన్నీల్లే దిగ మింగుకుంటూ . ఈ భాధకు మందు లేదే మరుపు ఒక్కటే మార్గం ఉన్నదిలే .