నవమాసాలు మోసే ప్రేమ నవ నాడుల్ని స్పందించే ప్రేమ . ఉదరంలోనే మొదలయ్యే ప్రేమ ఉహలకే అందనిది ఈ ప్రేమ . ఆహారాన్నే అందించే ప్రేమ అహర్నిశలు మనకై ఈ ప్రేమ . రక్షణకై ఉండే ఈ ప్రేమ రక్షించేదే ఈ ప్రేమ , అణువణువు పొందే ప్రేమ అనురాగం ఈ ప్రేమ , రక్త నాలాలతో మొదలయ్యే ప్రేమ రక్త బంధమే ఈ ప్రేమ , జన్మించుటకు కారణం ఈ ప్రేమ జన్మ కే అర్ధం ఈ ప్రేమ , నాకే మూలం ఈ ప్రేమ నన్నే మోసిన ప్రేమ......