Hello Poetry
Submit your work and get some sparkles! Create free account
షిరిడి సాయి నాధా శివునికి రూపమని రాముని అంసవని యేసులో కరుణవని అల్లాకే ప్రతిరూపమని నిన్నే కొల్చుతున్నానే...... శరణు కోరే శత్రువుకైన ప్రేమని పంచె మహాత్ముడవని జాలిని  కురిపించే  నిత్య  సంతోషరూపమని   జనుల  కోరికలు  తీర్చే  కల్పవృక్షమని మనసారా నిన్నే స్తుతిస్తున్నానే..... భిక్షాటన చేస్తూ వారి వారి పాపములు మోసే దీనబంధువని   రుగ్మతులు తొలగించే వైద్యరూపదారుడవని   కటిక చీకటిని కడతేర్చే కరణజన్ముడవని సద నీ నామ స్మరణలో మునిగిపోయెనే.... అనంత  జ్ఞాన సాధనకు నువ్వే శరణం ఇహలోక గమ్యాలకు నువ్వే ఆధారం ముక్తిని పొందే మార్గానికి ప్రధమం ఆత్మ జ్ఞాన సొంతానికి నువ్వే మూలం సృష్టిలోని జీవులకి నువ్వే సర్వం ..... కాలమే నువ్వేనోయి మా కర్మలే నీవేనోయి వేద పాఠాలన్ని  నీ  మాటలలోయి నీ పాదాల  చెంతే  గొప్ప  క్షేత్రమోయి   గంగా యమునలు  నీ మాటకు  లోబడి  ప్రవహిస్తాయి శ్రేష్టమైన  వాక్కులుంటే అది  నీ పేరే  సాయి రాతిలాంటి  మమ్మల్నే  మనిషిగా   మార్చేయి   జన్మలు  అన్ని  సార్ధకం  చేసేయి మనిషుల  మనసులే  సుద్దె  చేసి జీవితాలనే  చరితార్ధం  చేసేయి ..... ఓం  సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సదుగురు సమర్ధ సాయి నాధ్ మహారాజ్ కి జై
0
Sep 17, 2012
Sep 17, 2012 at 3:38 AM UTC
179.sai ram ki jai

Babu-kandula
Written by
Sep 17, 2012
Sep 17, 2012 at 3:38 AM UTC
Request permission to use this poem