ఒక్క మాటై పలికిందే మనసు సందేహాలను చీల్చేస్తూ నిశబ్దాన్నే చెరిపేస్తూ నీలో ఉన్న శక్తిని తెలుపుతూ నీ జన్మల కారణమే తెలుపుతూ భువి పై నీ కర్మలు చెబుతూ ఒక్క అర్ధం వివరణగా అందిస్తూ నిన్నే నీకు కొత్తగా చూపిస్తూ నీ గమ్యం చేరేలా జాడను చూపుతూ నిరాశను ఒదలమని నిగ్రహం ఉంచమని సహనము కలగమని పయనం సాగమని భయాలను తుంచమని విజయానికి మార్గాలు వెతకమని అనుభవ పాఠాలు నేర్చమని సూక్ష్మంగా సూచించేస్తున్నది అనుసరించావా నీదే ఆ గెలుపు సయ్యాటే ఇక నీ వంతు