మనసా వాచా కర్మన నిన్నే నేను ప్రేమిస్తున్నానే మనసిస్తానే నా ముందుకు రావే చెలి.. శూన్యంలోనే పడి ఉన్నానే సూర్యుని కాంతియై వెలిగించాలే.. రాహు కేతు కాచి ఉన్నారే నీ ప్రేమే రక్షై కాపాడాలే.. చంటి పాపనై నీ వైపే దిక్కులు చూస్తున్నా నీకోసం పడి చస్తున్నానే .. వేసవిలాగా నన్ను భాధించకే వర్షంలాగా నన్నే కరుణించవే.. రాతిని మరిపించే హృదయమే ఓ పువ్వులాగా మార్చివేసావే.. నన్నే నువ్వు విడిచావంటే రాతియుగానికి పోతానందే నా మనసు.. అర్ధిస్తున్నా ఆరాధిస్తున్నా దేవతలాగా నీ కరుణ కటాక్షించవే..