baburao chowdary kandula  

Cleveland,ohio    1990 -   
my name is baburao
i completed my b.tech in sri prakash college of engineering tuni and my
native place is raghudevapuram. . You can comment and give feedbacks to my posts so i can improve my style. guys i wanna know how many are visiting my account will you comment or like so that i can find you all. please friends

Poems

May 31

జీవనమే ఒక సాగరము
ఎత్తు పల్లాల కెరటాలతో సాగే పయనము
నీ దారిన సొర చేపలే ఉన్నా
ముక్కలు చేసే ముసలే ఉన్నా
నీ పట్టు వీడబోకు..
సాహసమే నీకున్న బలము
సహనమే సంపదగా సాధిమ్చేయి విజయము

May 31

ఓటమి గురుతులు ప్రేమ
గెలుపును చంపే ప్రేమ
రాతను రాసిన బ్రహ్మ
ప్రేమ గీతను చెరిపేసావు
ప్రేమల తీరం మరిగించావు
బ్రతుకే భారం చేసేసావు
వర్ణించలేని భాధలోన నన్ను ముంచేశావు
పాతాళం అంటే విన్న వాడ్ని
తన తోడులేక ప్రత్యక్షంగా చూస్తున్నా
భవ బంధాలను ఎన్నెన్ని ఉన్నా ఏదో లోటు
తను లేకపోతె మనసంతా పోటు
పరుగులు తీసిన హృదయ స్పందన సైతం
ఈ తన ఎడబాటుకి అతలాకుతలం
దారి తెలియక దిక్కు తోచక డీలా పడెను
ప్రేమ పయనం.

May 31

చేజారిన ప్రేమ తనలా తన మాయలా
నా కంటికి కనుమరుగైనది..
మనసు చూపే మమతిది
పసి పాపలా తిరుగుతున్నది...
మెరిసేనమ్మ తన నవ్వులు
ముత్యాలనే కురిపించేను..
దురమాయే ఆశల తీరం
తన సావాసమే కోరుకున్నది..
నిషి రాతిరిలో నీడలా
నా ప్రేమనే విడిచిందిగా..
నింగిని వదిలిన చినుకులా
నా కలలను వీదిపోవకు..
జాబిలిగా కనిపించు
జోలాలి పాడించు..
జగమంతా ప్రేమను కురిపించు..
ఏఖాకిలా ఎదురు ఈదను
యంత్రములా జీవించను
ఏ జన్మకైనా నీతోడుంటాను...

May 31

మెరుపులా నా కన్నులను తాకిందే
తన పేరు తన మాట వింటే
ఒళ్ళంతా జల్లే మనసంతా పులకింతే
తన పరిచయం ముందు నేనో ప్రవరఖ్యుడ్ని
తనే దూరం అయ్యితే నేను దేవదాసుని
తన కోసమే ఈ జీవనం
తన వెంటే నా పయనం
తన అడుగులే నా గమ్యం
తన్ని చూసే క్షణమే నాకు సూర్యోదయం
తన ముద్దుల మాటలే నాకయ్యేను జోలాలి పాటలులే

May 31

అమ్మాయే Equal to అపాయం
పెట్టుకుంటే అబ్బాయే అవ్వుతాడు పాపం
Apple నే తినిపించి దైవ లక్షణం పోగొట్టేనే
దేవునికే దూరంగా ఉండేలా చేసేనే
అరే నరక కూపంలో పడవేసేనే
Books తిరగేస్తే అక్షరాలలో కనపడతారే
Exam రాస్తుంటే mind అంతా దోర్లేస్తారే
Presence of mind ని ప్రశాంతంగా కొల్లగోడతారే
Infatuation కి మనసును నెట్టేస్తారు
ప్రేమ మైకంలోన పిచ్చి రాతలు రాయిస్తారే
ప్రతి మగవాడి పతనం వెనకాలా
ఒక్క అమ్మాయి కారణంలా ఉండొచ్చు
అందుకే జరా భద్రంగా ఎంచుకో నీ జోడి
లేకుంటే ప్రతి రోజు జరుగుతుంది కబ్బడి కబ్బడి

May 31

మనుషుల మధ్య మంత్రం ప్రేమ
మమతల కొలిమికి ద్వారం ప్రేమ
ప్రతి బంధానికి పునాధియే ప్రేమ
ఏ రూపానికి అతీతం కానిదే ప్రేమ
రాగ ద్వేషాలను రూపు మార్చేదే ప్రేమ
ప్రేమను ప్రేమతో ప్రేమిస్తే
ప్రేమే ప్రేమగా ప్రేమిస్తుంది

May 31

నడిచేటి దారిన పూచేటి పువ్వులో గుచ్చేటి ముల్లులో
బ్రతికేటి జన్మలో ఎదురయ్యేది కష్టమో కలిగేది సుఖములో
నావను నడిపే మనిషి నెత్తికి ఎట్లు ఎరుకా
అది తన కర్మ ఫలితమని తెలిపేది ఎవ్వరు
ఈ లోకానికి రుణపడి జీవించటమే కర్మనా
మోక్షమనే మాటకు మానవ జన్మకి అర్హత లేదా
ఆటు పోట్లతో జీవితమే గజి బిజీ మంత్రం
భూగోళం మొత్తం అయ్యేను గంధరగోలం

May 31

అమావాస్యలో ఆకాశం వదిలిన చంద్రుడిలా
సంధ్యా వేళలో అస్తమించి వెలుగులు దోచే సూర్యుడిలా
మరణం తరువాత దేహం విడిచే ఆత్మలా
చేయకే నన్ను ఒంటరిలా
ఆకాశంలో రాలే చుక్కల అనుబంధాన్నే విడవకిలా
రెక్కలు రాగానే విడిచే పిల్ల పిచ్చుకులా నానుండి దూరం కాకిలా
వసంతం పోగానే రాలే ఆకులా నా సావాసం మరవకే కోకిలా
వనవాసం అయ్యినా సర్డుకుపోతానే శాశ్వతంగా
వదిలేల్లితే హృదయ వేదనలో రగులుతానిలా
ప్రపంచమనే ఈ మహా సాగరంలో అవుతాను ఓ బొమ్మలా

Apr 16

ప్రాణేశ్వరి నా గుండె కోవెలలో నిలిచినా పంచాక్షరి
శృతి లయలతో చేస్తున్నావు నా నాడి మండలాన్ని అంత్యాక్షరి
దివి దివి దీపాలను నా కన్నులలో వెలిగిస్తున్నావే దివ్యాక్షరి
నా మనసుని ప్రేమా లోకంలో విహరిస్తున్నావే స్వప్న సుందరి
నీడై నీ వెనకే పడేలా చేస్తున్నావే సుకుమారి
నీతో బంధం కట్టేందుకే నేనింకా బ్రహ్మచారి

Apr 15

ప్రేమా నా సొంతం నువ్వే
అనే పంతం నాలో పెంచేసావే..
ప్రేమా నా ప్రాణం నువ్వే
అంటూ నాలోనే కదిలావే..
నీ ఊహల దాడులతో
నా గుండెను కుదిపావే..
నీ చూపుల గారడితో
నా మనసును వశపరిచావే..
ప్రేమా నా చూపుల ధీమా
నా తోడై ఉండి పొమ్మా..
ప్రేమా వెన్నెల కాంతివే
నా చీకటి భాటను వెలిగించుమా..
ప్రేమా వర్షించే మేఘమా
నా భాదను కరిగించుమా...

Apr 13

నీడల్లే తరమిన రాతిరి
నా మనసంతా చేసెను చీకటి..
ఏ రూపంలో వస్తుందో గానీ
ఆపేది ఎవ్వరో నానుండీ..
రోజంతా కనుమరుగౌతుంది
రాత్రైతే మీదకు దూకేస్తుంది..
విశ్వాన్ని కప్పే శక్తి ఉంది
దాన్ని ఆపే దమ్ము ఎవ్వరికి ఉంది..
వెయ్యి సూర్యుళ్ళు ఉన్నా
దాన్ని దాచేది లేదు ..
వంద జాబిళ్ళు ఉన్నా
దాన్ని మచ్చిక చేసేది లేదు..

Apr 4

మనసా వాచా కర్మన నిన్నే నేను ప్రేమిస్తున్నానే
మనసిస్తానే నా ముందుకు రావే చెలి..
శూన్యంలోనే పడి ఉన్నానే
సూర్యుని కాంతియై వెలిగించాలే..
రాహు కేతు కాచి ఉన్నారే
నీ ప్రేమే రక్షై కాపాడాలే..
చంటి పాపనై నీ వైపే దిక్కులు చూస్తున్నా
నీకోసం పడి చస్తున్నానే ..
వేసవిలాగా నన్ను భాధించకే
వర్షంలాగా నన్నే కరుణించవే..
రాతిని మరిపించే హృదయమే
ఓ పువ్వులాగా మార్చివేసావే..
నన్నే నువ్వు విడిచావంటే
రాతియుగానికి పోతానందే నా మనసు..
అర్ధిస్తున్నా ఆరాధిస్తున్నా
దేవతలాగా నీ కరుణ కటాక్షించవే..

Mar 25

నెత్తురు ఉడికించే నేటితరం
రేపటి తరానికి పోయాలి ఆద్యం
చెమటే చిందించే సహనం నీకుంటే
సంకల్పం సాధించేయగలా సత్తువ ఉంటదోయి
బుడి బుడి నడకల పాపైనా తానుగా నడక నేర్చదా
వికసించేలా నీలోని విశ్వం బయటకు తీసేయాలి
ఉదయించి సూర్యుడికైనా రాహువు వల్ల ఆపద తప్పదుగా
వెన్నెల కురిపించే జబిలికైనా కేతువు పన్నాగం తప్పదుగా
వ్యధ చెందే మనసును ఓదార్చే మెల్లగా సంజాయించేయి శ్రద్ధగా
ఈ విశ్వం నీదిగా.. పాలిస్తావో ఆనందం పంచేస్తావో నీ ఇష్టం.
ఆశయం సాధించేలా నిన్నే నువ్వు ప్రోత్సహించుకో
ప్రమాదం లేని పయనం లేదని
వెళ్ళే దారిని గమనించి వెల్లితేనే సాపిగా సాగును జీవితం

Mar 21

ఎదలో నువ్వే ఎదుటా నువ్వే ఏమి చేయాలే
ఏ క్షణమైనా  సంతోషాలే నువ్వు కనబడితే
వ్యర్ధం కాదిది వెంటే నేనుంటానంటే
నిన్ను Command చేసేలాగా ఉండలేనుగా
కాలం కన్నా నీ నవ్వే నాకు మిన్నా
కర్తవ్యమే నాకు నీతో గడిపేయటం
current ఏదో పాకిందే నువ్వెనో అలా చూస్తుంటే
సగం జన్మ సంత కెల్లుతుందే నువ్వు దూరంగా ఉన్నావంటే
మనసే కవితలా నీ పై స్పందించే
ఈ తపనని అర్ధం చేసుకో
తప్పకుండా నన్ను అందుకోవా
తారలాగా నా ఇంటిని వెలిగించి ఉండిపోవా
నువ్వే నా ప్రాణం
దోచావే నా కోపం
శాంతిలో కూర్చుండ పెట్టినావే

Mar 21

సుందరి గుండెల్లో పాడిందే లాహిరి
వలపంటే ప్రశ్నగా సాగానే ఇప్పటిదాకా
మేఘంలా కురిపించావే ప్రేమని
మధుర భావనలో మునిగిపొయెనె
నా భాటంతా ముల్లనిపించే ప్రతిసారి
నువ్వు కనపడిన తేది నుంచి మంచల్లె మారేనే
శబ్దం తాకిడి కూడా నిన్నే గుర్తు చేస్తోంది
మైకం లో కూడా నీ పేరే శరణం అవుతోందే
నన్ను వీడని నీడవై ఉంటావని కలలు కంటున్నానే
నీ ఆనందం నే  పొందే బహుమతిగా
నీ పంతం నే పొందే నజరానాలేగా ప్రేమా
అందుకుంటా నిన్ను నీ సాయం తోడై ఉంటే
సరి కొత్త లోకం చూపిస్తా నీకేనే బొమ్మా

Mar 18

కలా అలా అది ఒక్కలా నాలోనే పొంగిందే
నడి రాతిరిలో నడిచేస్తున్నా
మండు వేసవిలో నిద్రిస్తున్నా
నా అదుపు నేనే తప్పేస్తున్నా
నా రాతను మరచిపోతున్నా..
తెగ తెగ నడిచేస్తున్నా
నీ దారిన ముళ్ళు ఎన్నున్నా
ఒక్క నవ్వుకి పడిపోతున్నా
నీ మాటకు మైమరచిపోతున్నా..
గాలిలా నీ చుట్టూ తిరిగేస్తున్నా
కన్నీటిలా కళ్ళల్లో దాగున్నా
కాలిన మట్టిలా నీ కింద ఉన్నా
తెల్లని మబ్బల్లె ఆహ్లాదం పెంచేస్తున్నా
మండే నిప్పల్లె నీ చలినే దూరం చేస్తున్నా

Mar 18

ఎల్లోరా శిల్పంలా ఎదపై నిలిచావే
పన్నీటి రూపంలా నా మనసును కరిగించావే
వేకువ వెన్నెలవై Welcome చేస్తున్నావే
నా వాక్కిట ముగ్గల్లె కలలో కలిసావే
కళ్ళనే కలువగా పెట్టి ఏదో జాదు వేసేసావే
కాగితాలకే ప్రేమలు పరిమితం కాదే చెలియా
అది మనసు పలికే భాషేగా సఖియా
ఒంటరిగా ఉన్నా నీ ఊహలతొ గడిపానే ప్రియా
నిన్నే విడిచితే నా జన్మ నానుండి పాయా
నా ఆత్మ యమధర్మరాజు తో తప్పకుండా గయా

Mar 18

మంచులాంటి లోకంలోన పడిపోయా
రేయి పగలు Jackets లోన మునిగిపోయా
ఆంగ్ల భాష తప్ప తెలుగురాని దేశంలోన ఉండిపోయా
భవిత కోసం బంగారు భాటకోసం ఇక్కడేమో ఇరుక్కుపోయా
ఎవ్వరి పని వారిదంటూ ఎవ్వరి కాళ్ల మీద వాళ్ళు ఉండిపోవాల్లంటా
Bread Jam, Burger కన్నా కమ్మని మన ఇంటి వంట దొరకదంటా
Night లేదు Day లేదు డబ్బు కోసం ఎన్నో Shift లంటా
అమ్మ బాబోయి జబ్బు వస్తే Doctor Fees దంచునంటా
Technology లో ముందరంటా ..
వాటిని ఖంగు తినిపించే Technique మాది అంటా..
ఎన్ని తిప్పలున్న గాని మంచి Kick దొరుకుతుంది అంటా..

Mar 18

ఒక్కటే అడుగు
దాటావంటే గెలుపు..
తిరిగేనే మలుపు
పెరిగిందంటే బలుపు..
స్వార్ధం సముద్రమైతే
మిగిలేది అంతా భూటకం..
మోసం మనుగడ అయితే
జీవితమే దుర్భరం..
స్వేచ్చే దుర్వినియోగమైతే
నమ్మకమన్నేది నీటి రాతలే..
ముక్కలైతే మనసులు
జీవితాలు తాడు లేని బొంగరాలు..
కలుపుకుంటూ పోవటమే జీవనం
కష్ట నష్టాలలో అభయహస్తాలే..
కలిసి ఉంటె కలదు సుఖమోయి
కాంతివంతం కాకపోదా జనజీవనం

Mar 18

మనుషుల రూపానా ఉదయిస్తాడే దేవుడు
ఆపద కలిగిన చోటా ఆపద్భాండవుతాడు
కల్లా కపటం ఎరుగని వాళ్ళకు కరుణామయుడు
కాళ సర్ప విషమును కక్కేవాళ్ళకి కల్కి భగవానుడు
కరడు గట్టిన గుండెలు సైతం సున్నితం చేయగలడు
ధర్మమూ నలుగు పాదాలా నడిచేలా చూసుకునే ధర్మభద్రుడు
ధీనులను కాపాడ వచ్చే ధీనబంధువు
భక్తుల కోరికలు తీర్చే కల్పతరువు
వారి వారి పాపములు మోసే మహా స్వరూపుడు

 
To comment on this poem, please log in or create a free account
Log in or register to comment